Advertisementt

అతడు కోటిన్నర పలుకుతున్నాడుగా..!

Tue 22nd Nov 2016 06:33 PM
hero vijay,1.60 crores,pellichupulu movie hero  అతడు కోటిన్నర పలుకుతున్నాడుగా..!
అతడు కోటిన్నర పలుకుతున్నాడుగా..!
Advertisement
Ads by CJ

ఒక్క ఐడియా చాలు జీవితాన్ని మార్చేయడానికి. అలాగే సినీనటులకు ఒక్క హిట్‌ చాలు జీవితాన్ని అందనంత ఎత్తుకు తీసుకెళ్ళడానికి. నిజమే. ఇప్పుడు టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలో అదే జ‌రిగింది. ఋషి, ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం వంటి చిత్రాలలో విజయ్ కీ రోల్స్ పోషించిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమాలతో అంతగా పేరు రాలేదు, వచ్చినా గానీ ప్రేక్షకులు అంతగా విజయ్ లోని నటనను పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే పెళ్ళి చూపులు సినిమాతో విజయ్ అంటే ఎవరో, విజయ్ లోని నటునను అందరూ మెచ్చుకొన్నారు. కాగా మొదట్లో తాను చేసిన సినిమాలకి గాను విజ‌య్‌ ఎంత పారితోషికాన్ని పుచ్చుకున్నాడో తెలియదు గానీ, పెళ్లి చూపులకు మాత్రం రూ.6 ల‌క్ష‌లు అందుకొన్నాడ‌ని తెలుస్తుంది. తర్వాత పెళ్లి చూపులు సినిమా బీభత్సంగా హిట్టయ్యాక  విజ‌య్ కు ఎవ్వరూ ఊహించ‌నంత రెమ్యున‌రేష‌న్‌ని బోన‌స్ గా అందించినట్లు తెలుస్తుంది.

అయితే.. తాజాగా విజ‌య్‌ తన సినిమాకు రెమ్యునరేషన్ ను ఏకంగా కోటిన్న‌రకు పెంచేశాడని సినీవర్గాలు అంటున్నాయి. విజ‌య్ ద్వార‌క చిత్రానికి గాను రూ.20 ల‌క్ష‌లు మాత్ర‌మే తీసుకొన్నాడట. అయితే అర్జున్ రెడ్డితో చేసే సినిమాకు కూడా ఇంచుమించు అంతే తీసుకున్నట్లు టాక్. అందుకు కార‌ణం ఉంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలకు సైన్ చేసేనాటకి ఆయన పెళ్లి చూపులు సినిమా విడుదల కాలేదు. కాగా తాజాగా యూవీ క్రియేష‌న్స్ లో ఓ సినిమా చేస్తున్నాడు విజ‌య్‌. ఆ సినిమాకి గానూ విజయ్ రూ.80 ల‌క్ష‌లు తీసుకొన్నాడ‌ని తెలుస్తుంది. కానీ ఆ సినిమా తర్వాత కొత్తగా సైన్ చేసే ఏ సినిమాకు అయినా రూ.1.60 కోట్లు అడుగుతున్నాడ‌ని టాక్ నడుస్తుంది. ఈ విషయంపై విజయ్ ను అడిగితే.. తానెప్పుడూ పారితోషికం ఇంత ఇవ్వండని డిమాండ్ చేయ‌లేదని, వాళ్ల అవసరార్థం ఇస్తున్నారని, సహజంగా ఓ హిట్ తో మార్కెట్ రేటు కూడా పెర‌గుతుందని వివరించాడు.  మొత్తానికి పెళ్ళి చూపులు హీరో రెమ్యునరేషన్ ను భారీస్థాయిలో పెంచేశాడండోయ్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ