Advertisementt

టాప్‌ హీరోయిన్‌.. ప్రెగ్నెంట్‌ పిక్‌..!

Mon 21st Nov 2016 02:47 PM
kareena kapoor,pregnant,kareena kapoor pregnant pic,bollywood actress kareena kapoor  టాప్‌ హీరోయిన్‌.. ప్రెగ్నెంట్‌ పిక్‌..!
టాప్‌ హీరోయిన్‌.. ప్రెగ్నెంట్‌ పిక్‌..!
Advertisement
Ads by CJ

హీరోయిన్‌లకు పెళ్లి అవుతుందన్నా..లేదా వారు గర్భవతి అవుతున్నారని తెలిసినా..వారి ఫ్యాన్స్‌ ఎంత ఆనందిస్తారో..అంతకంటే ఎక్కువగా మీడియా దీనిపై ఫోకస్‌ పెట్టడం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే సంబంధం లేకుండా సినిమాకి సంబంధించిన ఏ సెలబ్రిటీ విషయంలోనైనా ఇది సర్వ సాధారణం. ఆ మధ్య ఐశ్వర్యరాయ్‌ విషయంలో ఫ్యాన్స్‌ నుండి మీడియా వరకు ఎంత హడావుడి జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. బాలీవుడ్‌లోని ఓ ఛానెల్‌ ఐశ్వర్యరాయ్‌ కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కోసం 50 లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడలేదు. అలా ఉంటుంది సెలబ్రిటీల మీద అభిమానం. తాజాగా బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా చలామణీ అవుతున్న కరీనా కపూర్‌.. ప్రెగ్నెంట్‌ అనే విషయం తెలిసినప్పటి నుండి మీడియా ఆమెపై ప్రత్యేక ఫోకస్‌ పెడుతూనే ఉంది. ఆమె ఏదైనా ఈవెంట్‌కి వస్తే..ప్రత్యేకంగా ఆమెనే టార్గెట్‌ చేస్తుంది. రీసెంట్‌గా ఓ యాడ్‌ నిమిత్తం ఇలా బయటికి వచ్చిన కరీనాని కెమెరాలు ఇలా క్లిక్‌ చేశాయి. అతి త్వరలో కరీనా..ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో.. బాలీవుడ్‌ మీడియా ఆమెను ప్రత్యేకంగా హైలెట్‌ చేస్తూ కథనాలు ప్రచురిస్తుంటే...బేబీ ప్రొడక్ట్స్ అమ్ముకునే పలు కంపెనీలు కరీనాని బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకుని తమ కంపెనీలను ప్రమోట్‌ చేసుకునే పనిలో పడ్డాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ