Advertisementt

బాలయ్య ఓపిక కి బిగ్ బి పరీక్ష..!

Tue 15th Nov 2016 09:07 PM
balakrishna,raithu movie,amitabh bachchan,krishna vamsi,balakrishna movies  బాలయ్య ఓపిక కి బిగ్ బి పరీక్ష..!
బాలయ్య ఓపిక కి బిగ్ బి పరీక్ష..!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి సిద్ధమైపోతుంది. ఇక క్రిష్, బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్ లో తీరికలేకుండా కష్టపడుతున్నారు. ఈ సినిమా ఆడియోని కూడా వచ్చేనెలలో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రాఫిక్స్ వర్క్ కూడా స్పీడందుకుంది. అయితే తన 100 వ చిత్రం షూటింగ్ సమయంలోనే బాలకృష్ణ తన 101 వ చిత్రాన్ని కూడా చేయాలని కృష్ణవంశీ తో 'రైతు' చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కృష్ణవంశీ కూడా ఒకపక్క నక్షత్రం సినిమా చేస్తూనే మరో పక్క బాలకృష్ణ రైతు చిత్రానికి సంబందించిన వర్క్ స్టార్ట్ చేసేసాడు.

దానిలో భాగం గానే కృష్ణవంశీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ని రైతు సినిమాలో నటించమని అడగడానికి బాలకృష్ణ తో కలిసి ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ అమితాబ్ తో భేటీ అయిన కృష్ణవంశీ, బాలకృష్ణ.. అమితాబ్ ని రైతు లో ఒక కీలక పాత్రకి ఒప్పించారని ఆ మధ్యన వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అమితాబచ్చన్ రైతు చిత్రం లో చెయ్యడానికి సుముఖంగా లేరని చెబుతున్నారు. ఆయనకు వేరే కమిట్మెంట్స్ వల్ల కుదరదని చెప్పినట్లు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంకా తాను రైతు సినిమాలో నటించాలంటే నా కమిట్మెంట్స్ అన్ని పూర్తి అవ్వాలని, దానికి చాలా టైం పడుతుందని..... అందుకే  వచ్చే జూన్ వరకు ఆగితే డేట్స్ కేటాయించగలనని చెప్పారట. మరి దాదాపు 6  నెలలు సినిమాని మొదలు పెట్టకుండా పోస్ట్ పోన్ చెయ్యడానికి బాలకృష్ణ ఒప్పుకుంటాడా? అమితాబ్ తో చెయ్యడానికి ఓపికపడతాడా? లేక మరో స్టార్ తో లాగించేస్తారా..? చూద్దాం ఏం జరుగుతుందో..?

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ