ఆదాయం కోసం మద్యం చేపట్టిన బాబు.!

Sun 13th Nov 2016 06:56 PM
ap cm chandra babu naidu,ap government,hotels,restaurants in alcohal  ఆదాయం కోసం మద్యం చేపట్టిన బాబు.!
ఆదాయం కోసం మద్యం చేపట్టిన బాబు.!
వచ్చే కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంపర్  ఆఫర్ ఇచ్చాడు. ప్రతి రోజు మద్యం సేవించే మద్యపాన ప్రియులకు రాబోవు సంవత్సరం నుండి శుభ సమయమనే చెప్పాలి. ఎందుకంటే.. వచ్చే ఏడాది అంటే జనవరి నుండి మద్యం విక్రయాలు బారీగా పెంచేలా, దాని ద్వారా రాష్ట్రానికి భారీమొత్తంలో ఆదాయం వచ్చేలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతుంది ప్రభుత్వం. రాబోవు ఏడాది జనవరి నుండి అన్ని ఫుడ్ కోర్డులలోనూ, రిసార్ట్స్ ప్రాంతాల్లోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా జీవో జారీ చేసింది చంద్రబాబు సర్కార్.   
కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 470 ప్రకారం ఫుడ్ కోర్టులలో, రిసార్ట్స్ లలో బెవరేజస్ ను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఈ జీవోను అనుసరించి ఏపీలో ఇక హోటల్స్, రిసార్ట్స్, బీచ్ లలో కూడా మద్యం అమ్మకానికి అనుమతులు జారీ చేసినట్టయింది ప్రభుత్వం. కాగా పర్యాటక రంగానికి ఆతిథ్య రంగానికి మరింత చేరువ అయ్యేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.