Advertisementt

హీరోలకు దడ..!!

Sun 13th Nov 2016 06:23 PM
tolywood,big heroes,temction,big notes,modi,black money,white money  హీరోలకు దడ..!!
హీరోలకు దడ..!!
Advertisement
Ads by CJ

పెద్ద నోట్ల రద్దు దేశవ్యాప్తంగా కల్లోలం కలిగిస్తోంది. బడాబాబులు నల్ల డబ్బును తెల్లగా మార్చేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. కరెన్సీ కల్లోలం టాలీవుడ్ లో సైతం చర్చనీయాంశమైంది. తెల్లగా మార్చుకోవాలంటే లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. బంగారం కొనే వీలు లేదు. బ్యాంకుల్లో మార్చాలంటే రెండున్నర లక్షలు మించితే లెక్కలు చెప్పాలి. ఇలాంటి పతాక సన్నివేశాల్లో తెరమీద అయితే విలన్లను చీల్చి చెండాడతారు. నిజ జీవితంలో మాత్రం వీలవదు కదా.. అందుకే కొత్త మార్గాలు వెతుకుతున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు సమయం ఉంది కాబట్టి మార్గాలు అన్వేషిస్తున్నారు. 

మన టాలీవుడ్ స్టార్స్ తీసుకునే పారితోషికంలో నల్ల డబ్బే ఎక్కువ. లేదా స్థిరాస్తి రూపంలో తీసుకుంటారు. ఇప్పటికే తీసుకున్న డబ్బును మార్చుకోవడానికి ఈసారి ఆడిటర్ల మీద ఆధారపడాల్సిందే. అందుకే టాప్ స్టార్స్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అంటే అడ్వాన్స్ గా తీసుకున్నట్టు చూపుతూ దాన్ని తెలుపుగా మార్చేయత్నం ఇది. అయితే ఇచ్చిన వారెవరో చెప్పాలి. ఆ ఇచ్చేవారు ఎక్కడ నుండి తెచ్చారో చెప్పగలగాలి. ఇది కూడా రిస్క్ వ్యవహారమే. జూబ్లీహిల్స్ లో నివాసం ఉన్న ఒక స్టార్ హీరో తన స్టాఫ్ కు అడ్వాన్స్ గా పెద్ద మొత్తం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. స్టాఫ్ తమ బ్యాంక్ ఎకౌంట్ లో వేసుకుని, ఆ తర్వాత తిరిగి ఇచ్చే ఒప్పందం కూడా ఇందులో ఉంది. అలాగే అత్యంత సన్నిహితులకు కూడా డబ్బు ఇచ్చి తెలుపుగా మార్చే యోచనలతో ఉన్నారట. స్టార్ హీరోల పరిస్థితి మాత్రం చాలా మంది నిర్మాతలకు ఆనందం గలిగిస్తోందట. తమ వద్ద ముక్కుపిండి వసూలు చేసిన హీరోల తిక్కకుదిరిందని వారు ఆనందిస్తున్నారని తెలిసింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ