Advertisementt

బోయపాటి శ్రద్ధతో... బెల్లకొండ సినిమా.!

Sun 13th Nov 2016 12:45 PM
boyapati srinu,bellamkonda srinivas,srikanth,rakul preet singh  బోయపాటి శ్రద్ధతో... బెల్లకొండ సినిమా.!
బోయపాటి శ్రద్ధతో... బెల్లకొండ సినిమా.!
Advertisement
Ads by CJ

స‌రైనోడు సినిమాతో బంపర్ సక్సెస్ కొట్టిన బోయ‌పాటి శ్రీ‌ను ఆయన తలచుకుంటే స్టార్ హీరోలు సినిమా చేయడానికి సిద్ధం అంటారు. అలాంటిది ఇలాంటి ఈ సమయంలో  బెల్లంకొండ శ్రీ‌నివాస్ కి ఇచ్చిన మాటకోసం ఆయనతో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడు బోయ‌పాటి... బెల్లంకొండ  చేసిన స్పీడున్నోడు బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో తన తప్పులు తెలుసుకున్న బోయపాటి ఈ సినిమా విష‌యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా సరైన విల‌న్ పాత్రకోసం వెతుకులాట మొదలెట్టాడు. విలన్ కి ఎవరైతే సెట్ అవుతారా అన్న విషయంలో శ్రీకాంత్, రాజ‌శేఖ‌ర్ వంటి సీనియర్ నటులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో విల‌న్ ఎవ‌రున్నప్పటికీ.. మ‌రో రెండు కీల‌క‌మైన పాత్రల్లో సరైన వారిని ఎంపిక చేసినట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఆ ఇద్ద‌రు క‌థానాయకులకు బోయ‌పాటి అప్పుడే మాట ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. వారెవరు అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉందన్నది సమాచారం. కాగా  బోయ‌పాటి, బెల్లంకొండ శ్రీ‌నివాస్ చిత్రం ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా ఈ చిత్రానికి క‌థానాయిక‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని కూడా ఎంచుకొన్నవిషయం తెలిసిందే.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ