Advertisement

బాహుబలిని దెబ్బతీసిన 'కట్ట'ప్ప

Sat 12th Nov 2016 05:00 PM
prabhas,s s rajmouli,baahubali 2,kattappa  బాహుబలిని దెబ్బతీసిన 'కట్ట'ప్ప
బాహుబలిని దెబ్బతీసిన 'కట్ట'ప్ప
Advertisement

వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న బాహుబలి 2 యూనిట్‌ వణికింది. యుద్ధభూమిలో శత్రువులను వణికించిన 'బాహుబలి'కి ఊహించని దెబ్బపడింది. అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న కట్టప్ప బాహుబలిని దొంగదెబ్బ తీసినట్టుగా ఐ.టి. అధికారులు షాక్‌ ఇచ్చారు. 

గురువారం సంస్థ కార్యాలయాలు, నిర్మాతల ఇండ్లపై ఐ.టి. అధికారులు దాడులు నిర్వహించారు. తాజా సమాచారం ప్రకారం రూ.60 కోట్ల కట్టలు సీజ్‌ చేశారని తెలిసింది. ఇవన్నీ రద్దయిన పెద్దనోట్లు.ఇంత పెద్ద మొత్తం కరెన్సీ ఆఫీసులో నిలువ ఉంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బయ్యర్లతో లావాదేవీలు జరుగుతున్నాయి. అడ్వాన్స్‌గా వచ్చిన మొత్తాన్ని ఆఫీసులో దాచారని తెలిసింది. ఇది బ్లాక్‌మని కావడం వల్ల మరో చోటికి తరలించే యత్నంలో ఐటి అధికారుల సోదాలు జరిగినట్టు సమాచారం. 

అసలే పెద్ద నోట్ల కష్టాల్లో ఉన్న టాలీవుడ్‌ను ఐ.టి. శాఖ చర్య ఆందోళన కలిగిస్తోంది. చిల్లర కష్టాల కారణంగా సినిమాల విడుదల, నిర్మాణం స్థంభించిన పోయిన నేపథ్యంలో తాజా పరిణామంతో నిర్మాతలు మౌనంగా ఉండిపోయారు. సంక్రాంతికే రిలీజ్‌ అవుతున్న మరో భారీ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం కార్యాలయంపై కూడా దాడులు జరుగుతాయనే అనుమానంతో యూనిట్‌ జాగ్రత్త ప డినట్టు తెలిసింది. 

ఇక బాహుబలి 2 సినిమాకు భారీ ఎత్తున వ్యాపారం జరిగినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ వ్యాపారం కూడా జరిగింది. రాబడి కోట్లలో ఉంది. దాంతో ఐ.టి. మేల్కొంది. లెక్కల కోసం దాడులు నిర్వహించింది. అయితే బాహుబలి యూనిట్‌లోని వ్యక్తులే ఐ.టి. అధికారులకు ఉప్పు అందించారని ప్రచారం జరుగుతోంది. సినిమాలో బాహుబలిని కట్టప్ప హతమార్చినట్టుగానే ఈ వ్యవహారం ఉందని అనుమానిస్తున్నారు. ఇంటిదొంగ ఎవరనేదానిపై చిత్ర యూనిట్‌ ఆరా తీస్తోందట.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement