Advertisement

మోడీ ప్రకటణకు… 4జీకి లింకు ఉంది..!

Thu 10th Nov 2016 04:28 PM
mukesh ambani,jio 4g,narendra modhi,  మోడీ ప్రకటణకు… 4జీకి లింకు ఉంది..!
మోడీ ప్రకటణకు… 4జీకి లింకు ఉంది..!
Advertisement

భారత ఫ్రధాని నరేంద్ర మోడి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం మోడి వెల్లడించేంత వరకు కనీసం ఆర్ బి ఐ లో పనిచేసే అధికారులకు కూడా తెలియదంటే నమ్మలేం. అయితే చూస్తే నిజమే అనిపిస్తుంది. అయితే మోడి ఆ నోట్లను రద్దు చేసేంతవరకు భారత్ లో ఎవరికీ ఆ విషయం తెలియదు. ఒక్క అంబానీకి తప్ప. ఆ పెద్ద నోట్లను రద్దు చేసే విషయం ముందుగానే అంబానీ సోదరులకు తెలుసనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఎందుచేతనంటే గత రెండు నెలల ముందుగానే అంబానీ అడుగులు చాలా విచిత్రంగా పడ్డాయి. అందుకు సంకేతాలు కూడా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి.  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రిలియన్స్ అధినేత ముఖేష్ అంబానీ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసమని, భారత్ లోని ముబైల్ నెట్ వర్క్ సంచలనాన్ని సృష్టించాడు. లేకపోతే మోడీ తీసుకున్న నిర్ణయానికి ప్రముఖులంతా సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు స్పందిస్తుంటే..  అంబానీ సోదరులు మాత్రం.. ఎటువంటి స్పందన తెలపకుండా అదంతా మాకు ముందే తెలిసులేవో... అన్నట్లు తమ పనుల్లో తాముండిపోయారు. అంటే మోడీ ముందుగానే  అంబానీ సోదరులకు ఈ విషయాన్ని తెలిపినట్లుగా తెలుస్తుంది. వారు తాజాగా చేపట్టిన నూతన వ్యాపారంలోని ఆఫర్లు వీటిని బట్టి అంబానీ సోదరులకు ముందే తెలిసినట్లుగానే అర్థమౌతుంది.  అందుకే అన్ని మొబైల్ నెట్ వర్క్ లకు దిమ్మతిరిగేలా, వాటిగా ధీటుగా ఉచితంగా రిలయన్స్ 4జీ టెక్నాలజీని అత్యంత అధునాతన స్పీడ్ తో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా భారత ప్రజలందరికీ డిసెంబర్ 30వ తేదీ వరకు ఉచితంగా ఇచ్చారంటే అదంతా వారి ఔదార్యమేం కాదు. ఎంతటి ముందు చూపు  లేకపోతే అంతటి అవకాశాలు వెదజల్లారు ఆ దిగ్గజ వ్యాపార వేత్తలు. మొత్తానికి భారత వ్యాపార దిగ్గజానికి ముందుగానే భారత ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసిందన్న మాట. అందులో భాగంగానే రిలియన్స్ ఒక్కసారిగా అంతటి విప్లవాన్ని సృష్టించిందని భారత వ్యాపార వర్గాలు, విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement