Advertisement

తెదేపా.. మైసూరా కి ఇలా గాలం వేసిందా..?

Tue 08th Nov 2016 08:30 PM
tdp,maisura reddy,ysrcp,cement factory,maisoora reddy rejoin tdp  తెదేపా.. మైసూరా కి ఇలా గాలం వేసిందా..?
తెదేపా.. మైసూరా కి ఇలా గాలం వేసిందా..?
Advertisement

ఒకప్పుడు తెదేపాలో మంచి హోదాలను అనుభవించిన మైసూరా రెడ్డి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా వ్యవహరించాడు. చాలా నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడుగా మైసూరాకు మంచి పేరున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఎవరినైనా ముక్కు సూటిగా మాట్లాడి సంచలనం రేపేలా ఆయన వాగ్బాణాలను వదిలేవాడు. ఎవరినైనా పొగడాలన్నా, తెగడాలన్నా ఆయన తర్వాతే ఏ రాజకీయ నాయకుడైనా. అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళీ సొంత గూటికి వచ్చేలా మార్గం సుగమం చేసుకోబోతున్నాడు. 

అయితే ప్రస్తుతం విషయం ఏంటంటే మైసూరా రెడ్డి వైకాపా నుండి తెలుగు దేశం పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మైసూరా తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ అవసరమైన చోట్ల పార్టీ అధినేతను పొగుడుతూ వ్యవహరిస్తున్న మైసూరా శైలిని చూస్తే నిజంగా అనుమానం కలుగుతుంది.

తాజాగా మైసూరా చంద్రబాబుకు అనుకూలంగా, చంద్రబాబును సమర్ధించేలా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా మైసూరా మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసుని ఆడియో టేపు ఆధారంగా సీఎం చ‌ద్ర‌బాబును త‌ప్పు ప‌ట్టలేం కదా.. డ‌బ్బులిస్తాం.. ఓటేయండి అని బాబు ఎప్పుడూ అడ‌గ‌లేదు అన్నాడు మైసూరా. ఓటుకు నోటు కేసుకు భ‌య‌ప‌డి కేసీఆర్‌తో చంద్ర‌బాబు లాలూచీ ప‌డ్డాడనడం రాజ‌కీయంగా బుర‌ద చ‌ల్లాల‌నుకోవ‌డ‌మేన‌ని ఆయన వెల్లడించాడు. ఇంకా మైసూరా మాట్లాడుతూ.... ప‌వ‌న్ ఇంకా ఇంట్లో భ‌ర‌త‌నాట్య‌మే చేస్తున్నాడనీ.. అందువల్ల జ‌న‌సేన ప్ర‌భావం ఇప్పుడు చెప్ప‌లేమని.. మైసూరా తెలిపాడు.  అయితే ఇంకా.. మైసూరా.. తన సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన క‌మ‌లాపురంలో త‌మకు చెందిన ఓటు బ్యాంకు చెక్కు చెద‌రకుండా అలాగే ఉందని, వైకాపా అధినేత జ‌గ‌న్ త‌న స‌ల‌హాలు, సూచనలు పాటించ‌క దెబ్బ‌యిపోయాడని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించి పెద్ద దుమారానికి దారితీశాడు. కాగా మైసూరా తిరిగి తెదేపాలోకి వెళ్ళడానికి కారణం తన సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం 140 ఎకరాల భూమిని అతి తక్కువ మొత్తానికి కేటాయించడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  ఓహో మైసూరా కి ఇలా గాలం వేశారా..అని కొందరు వైసీపీ నాయకులు కూడా అనుకుంటుండటం విశేషం.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement