'అఆ' పోరికి...అదిరిపోయే ఛాన్స్..!

Tue 08th Nov 2016 04:14 PM
anupama parameswaran,a aa movie,trivikram srinivas,pawan kalyan,anupama with pawan kalyan  'అఆ' పోరికి...అదిరిపోయే ఛాన్స్..!
'అఆ' పోరికి...అదిరిపోయే ఛాన్స్..!
Sponsored links

అనుపమ పరమేశ్వరన్ 'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన పేరు. ఆ సినిమాలో అనుపమ నెగెటివ్ కేరెక్టర్ లో కనిపించింది. 'అఆ' సినిమాలో అనుపమ, నితిన్ ని గాఢంగా ప్రేమించే పాత్ర చేసి  అందరిని అలరించింది. మళ్ళీ వెంటనే  నాగ చైతన్య పక్కన ఒక రోల్ లో  ప్రేమమ్ చిత్రంలో చేసింది. ఈ సినిమాలో అనుపకి పెద్ద స్కోప్ వున్న పాత్ర పడలేదు. ఇక ఈ సినిమాల తర్వాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. అయితే అనుపమని టాలీవుడ్ కి పరిచయం చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం 'అఆ' సినిమాలో ఫుల్ లెన్త్ పాత్రని అనుపమకి ఇవ్వలేకపోయాడట. ఇక ఈ విషయంలో అనుపమ పరమేశ్వరన్ కొంచెం అలిగినట్లు వార్తలొచ్చాయి. 

ఇక ఇప్పుడు పవన్ తో త్రివిక్రమ్ ఒక సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాలో పవన్ కి జోడిగా ఇద్దరు హీరోయిన్స్ ని డైరెక్టర్ త్రివిక్రమ్ సెలెక్ట్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అందులో ఒక హీరోయిన్ గా అనుపమని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. అనుపమలో వున్న టాలెంట్ ని పూర్తి స్థాయిలో బయట పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడని.... అందుకే తన ఈ సినిమాలో ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కాకపోతే మెయిన్ హీరోయిన్ గా అనుపమని తీసుకుంటాడా... లేక మళ్ళీ సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాడా అనేది తెలియాల్సి వుంది. 

ఒకవేళ నిజంగానే త్రివిక్రమ్ గనక అనుపమకి పవన్ పక్కన ఛాన్స్ ఇస్తే అనుపమ మాత్రం గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లే. ఒకవేళ ఈ ఛాన్స్ అనుపమని వరించకపోయినా పెద్ద నష్టమేమి ఉండదు. అసలు ఇప్పటికే అనుపమకి తెలుగులో రెడ్ కార్పెట్ వేసి మరీ తమ సినిమాల్లో ఆహ్వానాలు పలుకుతున్నారు దర్శక నిర్మాతలు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019