Advertisement

ఇక మోడి కూడా బ్రాండ్ అంబాసిడర్.!

Tue 08th Nov 2016 01:31 PM
india pm modi,modi brand ambassador,tourism deportment  ఇక మోడి కూడా బ్రాండ్ అంబాసిడర్.!
ఇక మోడి కూడా బ్రాండ్ అంబాసిడర్.!
Advertisement
భారత ప్రధాని నరేంద్ర మోడి దేశంలోని టూరిజం రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. టూరిజంలో విదేశీయులను బాగా ఆకర్షించే నిమిత్తం ఈ రంగంలోని ప్రచార బాధ్యతలకు మోడీనే వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకాలం విదేశీ టూరిష్టులను బాగా ఆకర్షించేందుకుగాను బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ప్రచార కర్తలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వారిని నియమించే యోచనకు స్వస్తి చెప్పింది కేంద్రం. టూరిజం ప్రచారం బాధ్యతల నుండి సెలబ్రిటీలను తొలిగించిన తర్వాత ఆ పదవి ఖాలీగా ఉంది. చాలా కాలం నుండి ఖాలీగా ఉన్న దాని స్థానంలో మోడి ఫోటోలు, వీడియోలతో  ప్రచారం జరుపుతున్నారు. అయితే ఇక నుండి ఇంక్రెడిబుల్ ఇండియా (అద్భుత భారత్) పేరుతో జరుపే ప్రచారంలో భాగంగా మోడీ మస్కట్ హవా కొనసాగనున్నట్లు తెలుస్తుంది. 
కాగా భారత ప్రధానిగా మోడి గత రెండున్నర సంవత్సరాలలో వివిధ సందర్భాలలో భారత దేశం గురించి పలు దేశాల్లో చేసిన ప్రసంగాలను ఈ టూరిజంలో భాగంగా పర్యావరణ శాఖ ద్వారా ప్రచారం చేయనున్నట్లు ఆ శాఖ అదికారులు వెల్లడించారు. ప్రధానంగా మోడి పలు సందర్భాల్లో దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాల విశేషాల గురించి చేసిన ప్రసంగాలను వీడియోల ద్వారా ప్రచారం జరపనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయా దృశ్యాలను ఎంపిక చేసే పనిలో సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక పోతే నవంబర్ చివరికల్లా ఈ పని పూర్తి అవుతుందని, డిసెంబర్ నాటికి క్రిస్ మస్ సందర్భంగా విదేశీ టూరిస్టులకు అనుకూలంగా సర్వం సిద్ధం కాబోతుందని పర్యాటక శాఖ అధికారి వివరించాడు.
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement