Advertisementt

కొత్త అవతారంలో హేమ ఆంటీ..!

Mon 07th Nov 2016 09:17 PM
hema aunty,saptagiri express,villain,character artist hema  కొత్త అవతారంలో హేమ ఆంటీ..!
కొత్త అవతారంలో హేమ ఆంటీ..!
Advertisement
Ads by CJ

తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన హేమ విలన్ గా కనిపించబోతుంది. ఎక్కువగా కమెడియన్స్ పక్కన భార్య పాత్రలను, అల్ల‌రి పాత్ర‌ల‌ను బాగా పోషించింది హేమ. తెలుగు లేడీ క‌మెడియ‌న్ గా మంచి గుర్తింపు సంపాదించింది. అప్పట్లో శ్రీ‌ల‌క్ష్మి త‌ర్వాత ప్లేసు హేమ‌ భర్తీ చేసిందనే చెప్పవచ్చు. అల్లరి న‌రేష్ న‌టించిన చాలా సినిమాల్లో హేమకు మంచి పాత్రలను పోషించింది. త్రివిక్ర‌మ్ సినిమాల్లో కూడా హేమ‌కు మంచి గుర్తింపునిచ్చే పాత్రలే వచ్చాయి. ఇంకా కృష్ణ‌భ‌గ‌వాన్‌బ్ర‌హ్మానందంఎమ్మెస్ లాంటి వాళ్ల ప‌క్క‌న నిల‌బ‌డి ఠీవీగా  మంచి నవ్వులు పండించే సెటైర్లు వేసేది హేమ. ఈ మ‌ధ్యనే జై సమైక్యాంధ్ర పార్టీ అనీ అలా తిరుగుతూ కొన్నాళ్ల పాటు హేమ దూకుడు తగ్గినా మళ్లీ తిరిగి ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌తో షాక్ ఇవ్వ‌నున్నట్లు తెలుస్తుంది. హేమ విల‌న్ గా ఓ సినిమా వస్తుంది. స‌ప్త‌గిరి క‌థానాయ‌కుడిగా వస్తున్న స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో హేమ తన విలనిజాన్ని ప్రదర్శించబోతుంది. కాగా ఈ చిత్రంలో హీరో స‌ప్త‌గిరి అయితే, విల‌న్ మాత్రం హేమ‌.

కాగా ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ న‌న్ను విల‌న్ గా ప్రేక్షకులు రిసీవ్ చేసుకొంటారాలేదా అనుకొంటున్నాను. కానీ.. ద‌ర్శ‌కుడు నా పాత్ర‌ని డీల్ చేసిన విధానం బాగా న‌చ్చింది. త‌ప్ప‌కుండా నాకు మంచి పేరు ఈ సినిమా ద్వారా దక్కుతుంది’ అని తన ఆకాంక్షను వెల్లడించింది హేమ. ఇంకా ఈ చిత్రంలో అలీ కూడా ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే స‌ప్త‌గిరి ఆడియో ఫంక్ష‌న్‌లో అలీ మాట్లాడుతూ.. స‌ప్త‌గిరికి ఓ గొప్ప స‌ల‌హా ఇచ్చాడు. అలీ మాట్లాడుతూ.. క‌మిడియ‌న్లు హీరోగా సినిమా చేస్తే అది లాట‌రీ టికెట్టు కొన్న‌ట్టే. ఎప్పుడో ఓసారి త‌గులుతుంది. ఆ డ‌బ్బులు జేబులో పెట్టుకోండి. కానీ అదే మోజులో పడి మ‌ళ్లీ మ‌ళ్లీ టికెట్ తీయాల‌ని చూడకండి. మనకు అసలు క‌మిడియ‌న్ పాత్ర‌లే శ్రీ‌రామ‌ర‌క్ష‌ అన్న విషయం తెలుసుకోండి’ అంటూ మాట్లాడాడు.  హీరోగా చేసినా కామెడీని మాత్రం వ‌ద‌ల‌కండీ అంటూ హితబోధ చేశాడు అలీ.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ