ఏదిఏమైనా మహేష్ తోనే సినిమా చేస్తాడంట!

Mon 07th Nov 2016 05:57 PM
sundar c,mahesh babu,350 crore budget movie,sundar c waiting for mahesh,vijay,suriya  ఏదిఏమైనా మహేష్ తోనే సినిమా చేస్తాడంట!
ఏదిఏమైనా మహేష్ తోనే సినిమా చేస్తాడంట!
Sponsored links

తెలుగు సినీ చరిత్రకు శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టిన చిత్రం ‘బాహుబలి’. అంతకంటే మంచి చిత్రాన్ని తీసి రికార్డులన్నింటినీ తిరగరాయాలని చూస్తున్నాడు తమిళ దర్శకుడు సుందర్ సి. అందుకోసం చాలా కాలం నుండి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ దర్శకుడు. అయితే ‘బాహుబలి’ కి ఆ చిత్ర నిర్మాతలు రూ.250 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేస్తే, ఈ దర్శకుడు మాత్రం ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్ తో రూపొందించేందుకు డబ్బులు చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడని వినికిడి. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రయత్నించి ఎదురుదెబ్బ తిన్నట్లుగా తెలుస్తుంది. అంతకు ముందు చాలా మంది హీరోల వద్దకు వెళ్ళి కథను వినిపించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మహేష్ తో సినిమా చేయాలని భావించిన దర్శకుడు సుందర్. సి అందుకు చర్చలు కూడా జరిపాడంట. అయితే మహేష్ వారికి నో చెప్పడంతో ఇక చేసేది లేక  తమిళంలో విజయ్ తో సినిమా తీయడానికి ప్రయత్నించాడంట. అయితే అక్కడ విజయ్ కూడా అందుకు అంగీకరించక పోవడంతో ఇక ఏం చేయలేక ఊరకుండలేదంట. ఏది ఏమైనా సరే ఇక  మహేష్ బాబుతోనే సినిమా తీస్తానని ప్రతిజ్ఞ పూని మరీ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తుంది.  అంతే కాకుండా తమిళ వెర్షన్ కోసం హీరో సూర్యతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు నటించేట్లయితే ఏకంగా రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి  ఈ సినిమా రూపొందించే అవకాశం ఉన్నట్లు కూడా అర్థమౌతుంది.  ఇంకా ఈ చిత్రానికి హీరోయిన్ గా బాలీవుడ్ నటి దీపికా పదుకోనేతో కూడా మాట్లాడినట్లు వెల్లడౌతుంది. ఇక మరి మహేష్ బాబు అంగీకారమే ఆలస్యం అంటున్నాయి సినీ వర్గాలు. మహేష్ బాబు ఏమంటారో చూడాలి? 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019