Advertisementt

10 సెకన్స్ తో ధృవ దుమ్మురేపాడు..!

Sun 06th Nov 2016 01:36 PM
ramcharan,rakul preeth singh,dhruva,10 sec promo,neethone dance  10 సెకన్స్ తో ధృవ దుమ్మురేపాడు..!
10 సెకన్స్ తో ధృవ దుమ్మురేపాడు..!
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ సినిమాతో డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోతున్నాడు. ధృవ సాంగ్స్  కూడా నవంబర్ 9 న మార్కెట్  లోకి వచ్చేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. ఈ ధృవ సినిమా తమిళ్ తని ఒరువన్ కి రీమేక్ గా సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. బ్రూస్ లీ సినిమాలో చరణ్ తో జోడి కట్టిన రకుల్ ప్రీత్ ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన మరోసారి నటిస్తుంది. ధృవలో పాటల ట్రాక్ లిస్ట్ ను.... ఆడియో అందిస్తున్న ఆదిత్య మ్యూజిక్ అఫీషియల్ గా చెప్పేసింది. అయితే ధృవ కి సంబందించి మరో విషయం ఏమిటంటే శుక్రవారం రాత్రి 7.30 కి ధృవ 10 సెకన్స్ 'నీతోనే డ్యాన్స్' సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ నీతోనే డ్యాన్స్ సాంగ్ టీజర్ లో రామ్ చరణ్ డాన్స్ తో చంపేశాడు. ఆ సాంగ్ లో చరణ్ స్టెప్స్ అదిరాయి అని అంటున్నారు. ఇక చరణ్ పక్కన రకుల్ కూడా ఆడిపాడింది. రకుల్ మాత్రం దేవ కన్యలా చరణ్ పక్కన మెరిసిపోతూ కనిపించింది. కేవలం 10 సెకన్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసాడు రామ్ చరణ్. ఇప్పటిదాకా ధృవ పై చాలా రూమర్స్ వచ్చాయి. తని ఒరువన్ ని సేమ్ అలాగే రీమేక్ చెయ్యకుండా చాలా మార్పులు డైరెక్టర్ సురేంద్ర రెడ్డి చేసాడని.... ఇంకా ఇందులో సాంగ్స్ విషయం లో కూడా డైరెక్టర్ కి చరణ్ కి గొడవలు జరిగినట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ 10 సెకన్స్ టీజర్ చూసిన వాళ్లు మాత్రం అవన్నీ ఒట్టిరూమర్స్ అని కొట్టిపడెయ్యడం ఖాయం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ