Advertisementt

ఈ సంస్థను కాష్మోరా కాపాడినట్లేనా..?

Sat 05th Nov 2016 07:36 PM
kaashmora movie,kaashmora movie hit talk,kaashmora hero kaarthi,pvp banner  ఈ సంస్థను కాష్మోరా కాపాడినట్లేనా..?
ఈ సంస్థను కాష్మోరా కాపాడినట్లేనా..?
Advertisement
Ads by CJ

పివిపి బ్యానర్ లో కార్తీ నటించిన రెండో చిత్రం కాష్మోరా. కాగా కార్తీ హీరోగా తాజాగా విడుదలై భారీ వసూళ్ళతో దూసుకుపోతుంది కాష్మోరా చిత్రం. పివిపి బ్యానర్ పై విడుదలైన కాష్మోరా చిత్రం ఈ బ్యానర్ లో చాలా కాలానికి మంచి టాక్ తెచ్చిపెట్టి మంచి వసూళ్ళను రాబడుతూ థియేటర్స్ వద్ద దుమ్ములేపుతుందనే చెప్పాలి. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే రూ.1కోట్లు వసూలు చేసిందంటే అసలు కార్తీ కెరీర్ లోనే అత్యంత బిగ్గెస్ట్ హిట్ గా  నిలిచిందనే చెప్పాలి.

కాగా తమిళ, తెలుగు రెండు భాషల్లో కూడా భారీ ఓపనింగ్స్ దక్కించుకున్న ఈ కాష్మోరా చిత్రం థియేటర్స్ వద్ద ఇంకా కలెక్షన్లతో బాగానే నడుస్తుంది. ఈ బ్యానర్ లో తొలిసారిగా వచ్చిన ఊపిరి చిత్రం మంచి విజయాన్నే అందుకున్నా, వసూళ్ల పరంగా  అంతగా రాబట్టుకోలేదు. కాగా పివిపి బ్యానర్ పై విడుదలైన సినిమాలన్నీ కూడా చాలావరకు అపజయాలు చవిచూసినవనే చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే.. మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం చిత్రం ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇలా ఈ బ్యానర్ పై విడుదలైన చాలా సినిమాలు లాభాలకంటే నష్టాలనే ఎక్కువగా తెచ్చిపెట్టాయని తెలుస్తుంది. ఆ రకంగా పివిపి బ్యానర్ గత కొంతకాలంగా నష్టాల్లోనే నడుస్తుంది. ఇక ఈ ఏడాది మొదట్లో విడుదలైన క్షణం’ చిత్రం మంచి విజయాన్నే ఇచ్చింది. చిన్న బడ్జెట్ తో రూపొందించిన సినిమా కాబట్టి వసూళ్లను కూడా ఆ స్థాయిలోనే రాబట్టుకుందనే చెప్పాలి.

అయితే కార్తీ ఈ బ్యానర్ లో మొదటి నటించిన చిత్రం ఊపిరి. ఆ తర్వాత రెండవ చిత్రంగా ‘కాష్మోరాలో కార్తీ హీరోగా నటించాడు. ఈ రెండు చిత్రాలు అత్యంత భారీ బడ్జెట్ తోనే రూపొందిన విషయం తెలిసిందే. అయితే ఊపిరి చిత్రం వసూళ్ళను రాబట్టే విషయంలో పర్వాలేదనుకున్నా, కాష్మోరాచిత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుందనే చెప్పాలి. అయితే చెప్పొచ్చేదేంటంటే... పివిపి బ్యానర్ ను కాష్మోరా కాపాడిందనే చెప్పాలి.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ