Advertisementt

సుమంత్ కి అక్కినేని హీరోనే అడ్డు.!

Fri 04th Nov 2016 12:16 PM
hero sumanth,akkineni hero naga chaitanya,naruda donaruda movie release,sahasam swasagaa sagipo movie release  సుమంత్ కి అక్కినేని హీరోనే అడ్డు.!
సుమంత్ కి అక్కినేని హీరోనే అడ్డు.!
Advertisement
Ads by CJ
అక్కినేని వారసుడు సుమంత్ కి చాలా ఏళ్ళ నుండి సరైన హిట్ లేక అల్లల్లాడిపోతున్న విషయం తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తీసుకొని నరుడా డోనరుడా సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు సుమంత్. ఏది ఏమైనా సరే ఈసారి గట్టిగా హిట్ కొట్టాలన్న ఉద్దేశ్యంతో హిందీలో హిట్ అయిన విక్కీ డోనర్ చిత్రాన్ని సుమంత్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 4 వ తేదీన శుక్రవారం నరుడా డోనరుడా చిత్రం విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి నాగచైతన్య చిత్రం చెక్ పెట్టనున్నట్లు తెలుస్తుంది.
కాగా నాగచైతన్య చిత్రం సాహసం శ్వాసగా సాగిపో నవంబర్ 11వ తేదీ విడుదల కానుంది. చాలా కాలం నుండి ఊరిస్తూ ఊరిస్తూ చివరికి ఇదే సమయంలో నాగ్ సినిమా విడుదల కానుండటంతో సుమంత్ కాస్త డీలా పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ శుక్రవారం తర్వాత వచ్చే శుక్రవారం నాగ్ చిత్రానికి థియేటర్స్ అన్నీ బుక్  కానుండటంతో సుమంత్ సినిమాకు థియేటర్స్ కొరత ఏర్పడుతుంది. సుమంత్ చిత్రం టైటిల్ బట్టి విచిత్రంగానే ఉన్నా నిలదొక్కుకోవడానికి కనీసం వారం అన్నా పడుతుంది. ఆ లోపు నాగ్ చైతన్యం చిత్రం థియేటర్స్ అన్నింటినీ ఎగరేసుకుపోనుండటంతో సుమంత్ కి మళ్ళీ బిడియం మొదలైంది. చాలా కాలం సమయం తీసుకొని ఈ నాగచైతన్య కూడా వారం గ్యాప్ తీసుకొని తన సినిమాకే అడ్డురావాలా అంటూ లోలోన సుమంత్ మదనపడుతున్నట్లు తెలుస్తుంది. ఇలా రానుండటంతో సుమంత్ సినిమాకు ఖచ్చితంగా నాగ్ చిత్రం ప్రభావితం చేస్తుందని కూడా సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. నిజానికి సుమంత్ కి ఈ మూవీ సక్సెస్ అవసరం. చాలా కాలం గ్యాప్ తీసుకొని నాగ్ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో మరో వారం విడుదల డేట్ పొడిగిస్తే కాస్త మేలేమోనని కూడా వార్తలు వెలువడుతున్నా నాగచైతన్య మాత్రం అది తమ చేతుల్లో ఏం లేనట్లుగా వెల్లడిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి సుమంత్ సక్సెస్ కి చైతూ అడ్డుపడుతున్నాడన్న మాట. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ