Advertisementt

కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ వస్తున్నాడయ్యో..!

Thu 03rd Nov 2016 08:34 PM
kiran kumar reddy,ap former cm kiran kumar reddy,ap former speaker kirankumar  కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ వస్తున్నాడయ్యో..!
కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ వస్తున్నాడయ్యో..!
Advertisement

తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విభజనకు గురికాక ముందు సమైక్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చివరి వ్యక్తి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయ పరిస్థితుల కారణంగా అందివచ్చిన అవకాశంగా కిరణ్ కుమార్ రెడ్డికి ఈ అవకాశం దక్కింది. ఎవరూ ఊహించని విధంగా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి బయటకు వ్యతిరేకిస్తూ లోపల కేంద్రానికి పూర్తిగా సహకరించడం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. అలా ఆ తర్వాత రాజకీయ డ్రామాలో భాగంగా యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జై సమక్యాంధ్ర పార్టీని స్థాపించాడు కిరణ్ కుమార్ రెడ్డి. అది ఎన్నికల్లో ఏమాత్రం సక్సెస్ కాకపోవడంతో ఏం చేయాలో తోచక, తాత్కాలికంగా రాష్ట్ర రాజకీయాలకు స్వస్తి చెప్పి అలా సొంత ఊర్లో వ్యవసాయం కొన్ని రోజులు, హైదరాబాద్ లో పనులు చూసుకుంటూ గడుపుతున్నాడు. తాజాగా మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని బుద్ధి పుట్టినట్లుగానే తోస్తుంది. ఈ మధ్యకాలంలో కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితులతో కొన్ని విషయాలను పంచుకున్నట్లు తెలుస్తుంది. అదేంటంటే.. తన అభిమానులు, కార్యకర్తలను ఆయన స్వయంగా తనను ఏ పార్టీలోకి వెళ్ళమంటారని  ప్రశ్నించినట్లు వార్తలు అందుతున్నాయి. దీంతో ఆయన ఏదో ఒక పార్టీలోకి వెళ్ళడం ఖాయమైనట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఇంకా సమాచారం అందాల్సి ఉంది. కానీ ఏదైనా పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నట్లు పెళ్ళి అయితే కుదిరింది గానీ, పెళ్లి కూతురు ఎవరన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని, దానికి సంబంధించి త్వరలోనే పెళ్లి కార్డులు అందిస్తామని, అందరూ తప్పకుండా పెళ్లికి మాత్రం రావాలని కిరణ్ చమత్కరించినట్లు తెలుస్తుంది.  కాగా కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడన్న వార్తలు రాగానే ఆంధ్ర నాయకులంతా ఏ పార్టీలోకి రావచ్చన్న ఊహాగానాల్లో విహరిస్తున్నారు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement