స్టార్ హీరోల ఝలక్ తో కమెడియన్ వైపు పూరి!

Thu 03rd Nov 2016 08:29 PM
star heroes,puri jagannadh,sunil,mahesh babu,jr ntr,ism  స్టార్ హీరోల ఝలక్ తో కమెడియన్ వైపు పూరి!
స్టార్ హీరోల ఝలక్ తో కమెడియన్ వైపు పూరి!
Sponsored links

ఇజం సినిమా దెబ్బకి పూరి రేంజ్ బాగా తగ్గిపోయినట్లుంది. ఇజం రిజల్ట్ చూశాక ఏ స్టార్ హీరో కూడా పూరి తో సినిమా చెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదనేది ఇప్పుడు నడుస్తున్న టాక్. ఇజం హిట్ అయితే గనక ఎన్టీఆర్ తోనే సినిమా చేసే ఛాన్స్ వచ్చేది. కానీ ఇజం సినిమా చూశాక పూరి తో చెయ్యడానికి ఎన్టీఆర్ వెనుకడుగు వేసాడు. ఇక పూరితో జనగణమన చేద్దామన్న మహేష్ కూడా సైలెంట్ గా కొరటాల శివతో సినిమా చెయ్యడానికి సిద్ధమై పోయాడు. మరి పూరి కి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశం ఇక రాదా?

ఇదిలా ఉంటే పూరి.. సునీల్ ని డైరెక్ట్ చేస్తున్నాడనే ఒక వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది. మరి స్టార్ హీరో లు ఛాన్స్ ఇవ్వకపోతే ఏదో ఒక సినిమా చెయ్యాలి కదా.. అందుకే సునీల్ హీరోగా ఒక సినిమా చెయ్యడానికి పూరి సిద్ధమయ్యాడనే వార్తలొస్తున్నాయి. ఇక సునీల్ కి కూడా ఇప్పుడు ఒక హిట్ కంపల్సరీ. లేకుంటే హీరో గా ఎగ్జిట్ అవ్వడానికి రెడీ అవ్వాలి. ఈ మధ్యన వచ్చిన సునీల్  సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇక ఇప్పుడు గనక ఒక హిట్ సినిమా రాకపోతే సునీల్ ఇక హీరో పాత్రలకు బై బై చెప్పేసి మళ్ళీ కమెడియన్ గా సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

అందుకే పూరి.. సునీల్ కలిసి ఒక డీల్ కి వచ్చారని ప్రచారం జరుగుతుంది. ప్లాప్స్ లో వున్న సునీల్ కి ఒక హిట్ ఇస్తానని పూరి ప్రామిస్ కూడా చేసాడని అంటున్నారు. ఇక సునీల్ సినిమాకి స్టోరీ కూడా రెడీ చేస్తున్నాడని అంటున్నారు. పాపం పూరి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం తప్పిపోయి ఇప్పుడు ఒక కమెడియన్ కి హిట్టు ఇవ్వాలనే కసిగా పని చేస్తున్నాడట.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019