Advertisementt

జయలలితకు చేతబడి చేశారంట..!

Wed 02nd Nov 2016 08:09 PM
jayalalitha,black magic,karunanidhi,tamilnadu  జయలలితకు చేతబడి చేశారంట..!
జయలలితకు చేతబడి చేశారంట..!
Advertisement
Ads by CJ

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత జయలలిత అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీ చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆమె అనారోగ్యంపై గత కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వ్యాపించిన నేపథ్యంలో తాజాగా మరో కొత్త విషయం తెలుస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై కొందరు వ్యక్తులు చేతబడి చేయడం కారణంగానే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యిందంటూ లండన్‌ నుంచి వెలువడే డైలీ మెయిల్‌  పత్రిక ఒక కథనాన్ని వెలువరించింది. ఇంకా అందులో ఏం వెల్లడించారంటే.. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్యుడే ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని అందించినట్లు కూడా ఆ పత్రిక పేర్కొంది.  కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి డీఎంకే పార్టీలోని కొంతమంది వ్యక్తులు ఈ దురాగతానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. కాగా డీయంకే వర్గాలకు చెందిన వ్యక్తులు గానీ, అలాగే అన్నాడీఎంకేలో జయలలిత అంటే పడని వారు సైతం ఇలాంటి పనులకు పాల్పడి ఉంటారన్న విషయంపై ముమ్మరంగా అనుమానాలు వ్యక్తమౌతున్నట్లు తెలుస్తుంది. 

ఇంకా ఇందులో భాగంగానే...డీఎంకే అధినేత కరుణానిధి అనారోగ్యంపై కూడా తాంత్రిక శక్తుల ప్రభావం లేకపోలేదని అదే జ్యోతిష్యుడు వెల్లడించినట్లుగా అదే వార్తా కథనం ద్వారా వెల్లడౌతున్న అంశం. అయితే ప్రస్తుతం జయలలిత ఆరోగ్యం మెరుగౌతుందని, మెల్లిమెల్లిగా స్పందిస్తుందని త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావచ్చునన్న వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ