బాహుబలి నిర్మాతలకు అంత డబ్బు పిచ్చుందా..?

Sun 30th Oct 2016 09:40 PM
baahubali 2 movie,producers,bollywood rights,rajamouli,karan johar  బాహుబలి నిర్మాతలకు అంత డబ్బు పిచ్చుందా..?
బాహుబలి నిర్మాతలకు అంత డబ్బు పిచ్చుందా..?
Sponsored links

'బాహుబలి' చిత్రం ఇతర భాషల విషయం పక్కనపెడితే బాలీవుడ్‌లో మాత్రం ఈ చిత్రం సాదించిన విజయం, వసూళ్లు చూసిన వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో సాధించిన విజయం, దాని వసూళ్లకు కారణం ఎవరంటే అందరూ కరణ్‌జోహార్‌ పుణ్యమే అని ఒప్పుకుంటారు. ఈ చిత్రాన్ని ఆయన హిందీ హక్కులను పొందడం వల్లే ఈ చిత్రం అంతటి ప్రమోషన్‌ను, మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో కరణ్‌జోహార్‌ హక్కులను పొందడం వల్లే ఆ చిత్ర విజయానికి ప్లస్‌ అయిందనేది అందరూ ఒప్పుకునే మాట వాస్తవం. ఈచిత్రం మొదటి భాగం చూపించిన విజయం, సాధించిన వసూళ్లను చూసి ఇప్పుడు బాలీవుడ్‌కి చెందిన పలు పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్‌ సంస్ధలు హక్కులు సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. పోటీ ఇలా ఉండటంతో బాహుబలి నిర్మాతలు ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌ చూసి తమ సెకండ్‌ పార్ట్‌కు మరీ అత్యాశగా రేట్లను చెబుతున్నారట. దీంతో అంత పెద్ద మొత్తానికి తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదని కరణ్‌జోహార్‌ భావిస్తున్నాడు.ఒక వంక ఈ చిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చూసి నిర్మాతలు భారీ రేట్లు చెబుతుంటే, కరణ్‌ జోహార్‌ మాత్రం అంత రేటు ఎక్కువని భావిస్తూ.. ఈ పోటీ నుండి పక్కకు తప్పుకున్నాడనేది బాలీవుడ్‌ మీడియా మాట. మరి కరణ్‌జోహార్‌ లేని 'బాహుబలి 2'ని హిందీలో మనం ఊహించగలమా? అంటే లేదనే సమాధానం వస్తోంది. కేవలం బాహుబలి నిర్మాతల అత్యుత్సాహమే కొంపముంచుతుందనే ఉద్దేశ్యంతో రాజమౌళి సైతం ఆ చిత్ర నిర్మాతలకు క్లాస్‌పీకాడని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏది ఫైనలో కొన్ని రోజులైతే గానీ తెలియదు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019