పక్కాగా నాని లోకల్ లుక్ అదుర్స్!!

Fri 28th Oct 2016 10:29 PM
nani,nenu local,nani nenu local first look  పక్కాగా నాని లోకల్ లుక్ అదుర్స్!!
పక్కాగా నాని లోకల్ లుక్ అదుర్స్!!
Advertisement
Ads by CJ

'నేను లోకల్' అంటూ నాని ఫస్ట్ లుక్ తో ఎంట్రీ ఇచ్చేసాడు. నాని ఈ మధ్యన అదృష్టాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడని అతని సినిమాలు చూస్తే  అర్ధమవుతుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని  ఇప్పుడు త్రినాధ్ రావు డైరెక్షన్ లో 'నేను లోకల్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా 'నేను శైలజ' ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. 'భలే భలే మగాడివోయ్' చిత్రం తో సక్సెస్ బాట పట్టిన నాని 'జంటిల్మన్' వరకు సక్సెస్ హవా కొనసాగిస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయాడు. 'జంటిల్మన్' తర్వాత వచ్చిన 'మజ్ను' పర్వాలేదనిపించింది. 'మజ్ను' తర్వాత  ఇప్పుడు 'నేను లోకల్' అనే సినిమాతో రావడానికి రెడీ అవుతున్న నాని ఈ దీపావళి పండక్కి ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ ఫస్ట్ లుక్ లో నాని సిగరెట్ తాగుతూ పక్కా లోకల్ గా కనిపించాడు. రఫ్ లుక్ లో నాని  'నేను లోకల్' టైటిల్ కి కరెక్ట్ గా సరిపోయే రీతిలో ఫస్ట్ లుక్ డిజైన్ వుంది. ఇక ఈ 'నేను లోకల్' సినిమాకి క్యాప్షన్ గా ఆటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటూ నాని మరోసారి హిట్  కొట్టడానికి రెడీ అయ్యాడన్నమాట. ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం  అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ