ప్రభాస్ లుక్ కి ఫిదా అయిపోతున్నారు!

Sun 23rd Oct 2016 04:55 PM
prabhas,bahubali 2,baahubali the conclusion,prabhas look,baahubali 2 prabhas look  ప్రభాస్ లుక్ కి ఫిదా అయిపోతున్నారు!
ప్రభాస్ లుక్ కి ఫిదా అయిపోతున్నారు!
Sponsored links

బాహుబలి మొదటి భాగం దేశవ్యాప్తం గా ఎంత సంచలనమో అందరికి తెలిసిందే. రాజమౌళి ఒక రేంజ్ లో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసాడు. బాహుబలి 1 తో  ప్రభాస్ తో సహా ఈ సినిమాలో నటించిన నటీనటులు మంచి గుర్తింపు పొందారు. బాహుబలి పార్ట్ 1 సినిమా ఎన్ని సంచలనాలకు నెలవైందో..... ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కూడా విడుదలకు ముందే సంచలనాలని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమా 2017 ఏప్రిల్ 28 న విడుదల తేదీ ప్రకటించేశారు. అయితే ఇప్పటివరకు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న బాహుబలి 2 ఇప్పుడు ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రేపు(అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ గా బాహుబలి టీమ్ ఈ ఫస్ట్ లుక్ ని ఒక రోజు ముందే ప్రభాస్ అభిమానుల కోసం విడుదల చేసింది. ఈ బాహుబలి  ఫస్ట్ లుక్ ని రాజమౌళి అండ్ టీమ్ ముంబై లో విడుదల చేశారు. ఈ విడుదల కార్యక్రమం లో రాజమౌళితో పాటు  ప్రభాస్, అనుష్క, తమన్నా లు పాల్గొన్నారు.

బాహుబలి పార్ట్ వన్ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ని ఒక రేంజ్ లో చూపించిన రాజమౌళి ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 లో ప్రభాస్ ని ఒక చేతిలో కత్తిని పట్టించి మరో చేతిలో ఇనుప గొలుసులతో ప్రభాస్ ని అబ్బో అనిపించే రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ లుక్ లో ప్రభాస్ ని 8 ప్యాక్ లో చూపించాడు, ఇంకా బ్యాగ్రౌండ్ లో అమరేంద్ర బాహుబలిని చూపించిన రాజమౌళి..... ప్రభాస్ కోపాన్ని, కసిని అతని కళ్లలో చూపించాడు. ఈ విధం గా ప్రభాస్ ని చూసిన వాళ్లకి బాహుబలిలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో వుంటాయో అని అప్పుడే చర్చించుకోవడం మొదలెట్టేసారు. ఈ లుక్ కి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్  టీజర్ ని వచ్చే జనవరిలో విడుదల చేస్తామని రాజమౌళి ఎప్పుడో చెప్పాడు. ఇక ప్రేక్షకులందరూ ఆ టీజర్ కోసం కళ్ళల్లో వత్తులేసుకుని ఆసక్తిగా జనవరి వరకు ఎదురు చూడాల్సిందే.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019