Advertisementt

ఈ కమెడియన్ శకం ముగిసినట్లేనా..!

Sat 22nd Oct 2016 08:41 PM
brahmanandam,comedian,brahmanandam hero,rashmi,anasuya  ఈ కమెడియన్ శకం ముగిసినట్లేనా..!
ఈ కమెడియన్ శకం ముగిసినట్లేనా..!
Advertisement
Ads by CJ

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మనందం పనైపోయినట్లేనా....! అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. బ్రహ్మనందం ని కమెడియన్ గా  ఈ మధ్యన ఎక్కువగా పెద్ద సినిమాల్లో కానీ చిన్న సినిమాల్లో కానీ తీసుకోవట్లేదు. ఆయన స్థానం లోకి చిన్న పెద్ద కమెడియన్స్ చాలా మందే వచ్చి చేరారు. మరి ఒక్కసారిగా ఆయన విలువ ఎందుకు పడిపోయింది అంటే... ఆయన్ని చూసి చూసి జనాలకు బోర్ కొట్టడం ఒకటైతే జబర్దస్త్  పుణ్యమా అంటూ చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ కావడం మరొకటి. ఇక ఇదే కాకుండా మరో ముఖ్యమైన కారణం కూడా బ్రహ్మనందం ని కమెడియన్ పోస్ట్ కి దూరం చేసింది. అదేమిటంటే ఆయన రెమ్యునరేషన్. అయన ఒక్కో సినిమాలో నటించడానికి ఒక్కరోజు కి దాదాపు రెండు లక్షల దాకా తీసుకుంటాడని అంత భారీ మొత్తాన్ని భరించలేకే ఆయన్ని సైడ్  చేశారనే టాక్ నడుస్తుంది. 

ఇక ఇప్పుడుబ్రహ్మనందం హీరో అవ్వాలనుకుంటున్నాడట. ఇప్పటికే బ్రహ్మి గతంలో ఒక సినిమాలో హీరోగా కనిపించాడు. కానీ ఆ సినిమాతో ఆయన హీరోగా పెద్దగా ఆకట్టుకోలేక ఇక కమెడియన్ గానే ఇండస్ట్రీ లో సెటిల్ అయ్యిపోయాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆయన హీరో అవతారం ఎత్తనున్నాడని అంటున్నారు. ఈ సినిమాని బ్రహ్మీ నే డైరెక్ట్ చేస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో బ్రహ్మనందం కి జోడిగా ఇద్దరు హీరోయిన్స్ కూడా నటిస్తారట. వారెవరో కాదు హాట్ యాంకర్స్ అయిన అనసూయ, రష్మీలు బ్రహ్మనందం పక్కన కనబడనున్నారని టాక్. ఈ సినిమాకి సంబంధించి స్టోరీ కూడా రెడీ అయ్యిందని తొందరలో సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. ఇంకా దీనికి సంబందించి అధికారిక ప్రకటనయితే వెలువడలేదు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ