Advertisement

మోడీపై విరుచుకుపడ్డ బాలీవుడ్ దర్శకుడు!

Tue 18th Oct 2016 05:12 PM
narendra modi,anurag kashyap,ye dil hai mushkil,pakistan  మోడీపై విరుచుకుపడ్డ బాలీవుడ్ దర్శకుడు!
మోడీపై విరుచుకుపడ్డ బాలీవుడ్ దర్శకుడు!
Advertisement

భారత ప్రధాని నరేంద్ర మోడీపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విరుచుకుపడ్డాడు. ఈ విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతుంది. భారత సైన్యంపై ఉరీలో పాకిస్తాన్ విగ్రవాదులు విరుచుపడ్డ విషయం తెలిసిందే. అందుకు భారత సైన్యం కూడా సర్జికల్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల్లో భాగంగా బారతీయ సినిమాలలో పాకిస్తాన్ నటులు నటించకూడదని అలా నటించిన సినిమాలను పలు రాష్ట్రాల్లో ప్రదర్శించేది లేదు అని కూడా భారతీయ సినీ యాజమాన్య ప్రదర్శకుల సంఘం తీర్మానించింది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించిన ఏ దిల్ హై ముష్కిల్ చిత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.

అయితే ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చిందంటే కరణ్ జోహార్ కు అండగా నిలుస్తూ అనురాగ్ కశ్యప్ కొన్ని మాటలు మాట్లాడాడు. ఏ దిల్ హై ముష్కిల్ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రధాని మోడి పాక్ లో పర్యటించాడని, అందుకు ప్రధాని మోడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నాడు. దీంతో ప్రధాని మోడీపై విమర్శలు చేసే అధికారం కశ్యప్ కు లేదని నెటిజన్లు విరుచుకు పడుతున్నారు.  ఈ విషయంలో కశ్యప్.. మోడి విషయాన్ని ప్రస్తావించి సమర్థించుకొనే ప్రయత్నం చేశారు. తనను విమర్శించే ముందు వారికి దేశభక్తి ఉందో లేదో తెలుసుకోవాలని వెల్లడించాడు. ప్రధానిని విమర్శించే హక్కు తనకుంది, కాబట్టి ఇలా సోషల్ మీడియాలో విచక్షణా రహితంగా నోరుపారేసుకోవడం ఏ ఒక్కరికీ మంచిది కాదని అనురాగ్ కశ్యప్ వివరించాడు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement