Advertisementt

నానికి హీరోయిన్ సర్టిఫికెట్ ఇచ్చింది..!

Mon 17th Oct 2016 05:33 PM
nani,majnu,nani with anu emmanuel,anu emmanuel praises nani  నానికి హీరోయిన్ సర్టిఫికెట్ ఇచ్చింది..!
నానికి హీరోయిన్ సర్టిఫికెట్ ఇచ్చింది..!
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నానికి వరుస హిట్స్ వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా అతడి సినిమాలు బావుంటాయని ప్రశంసిస్తున్నారు. కొందరైతే నాని మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడని అంటారు. ఇలాంటి అభినందనలు అందుకుంటున్న నానికి నాయికలు సైతం సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇటీవలే విడుదలైన 'మజ్ను' చిత్రంలో అను ఇమ్మానుయేల్ అనే మలయాళ కుట్టి నటించింది. సినిమాలో ఆమెకు మంచి పేరు వచ్చింది. అను తాజాగా గోపీచంద్ తో 'ఆక్సిజన్', రాజ్ తరుణ్ తో మరో సినిమా చేస్తోంది. మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయట. ఇదిలా ఉంటే నాని తన అభిమాన హీరో అని, తెలుగు హీరోల్లో అతడిని ఇష్టపడతానని అను వెల్లడించింది. పైగా నానికి 'యాక్టింగ్ కింగ్' అంటూ సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఈ ప్రకటన ఇతర హీరోలు పాజిటివ్ గా తీసుకుంటే సరి లేదంటే అనుకు ఇబ్బంది తప్పదు. పైగా గోపిచంద్ తో కలిసి 'ఆక్సిజన్' సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. అయినప్పటికీ ఈ  కొత్త పిల్ల మనసులో మాటని ఎలాంటి బేషజాలు లేకుండా చెప్పేసింది. కొసమెరుపు ఏమంటే ఆమెకు మహేష్ బాబు, పవన్ కల్యాణ్ తో కలిసి నటించాలనే కోరిక ఉందట. ఆల్ ది బెస్ట్.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ