Advertisement

కేసీఆర్..కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాడా..!

Wed 12th Oct 2016 11:16 PM
kcr,telangana,new districts,bangaru telangana,31 districts  కేసీఆర్..కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాడా..!
కేసీఆర్..కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాడా..!
Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దసరా సందర్బంగా ఎంతో ఆర్భాటంతో 21 కొత్త జిల్లాలను ప్రారంభించాడు. ముందు రాష్ట్రం 10 జిల్లాల తెలంగాణగా ఉండగా అది కాస్త 31 జిల్లాల తెలంగాణగా రూపొందింది. జిల్లాల విభజనకు ముందు విభజన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి ఎంతో తర్జనభర్జనలు చేసి తీవ్ర కసరత్తులు చేసి మరీ 31 జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేశాడు కేసీఆర్. ఆ ఘనతంతా కేసీఆర్ కే దక్కుతుంది. పరిపాలన సౌలభ్యం కోసమంటూ బయటకు ఎంత వెల్లడిస్తున్నా అంతకంటే ఎక్కువగా రాజకీయ ప్రయోజనాలు ఈ జిల్లాల విభజనలో చోటుచేసుకున్న అంశం. అది జగమెరిగిన సత్యం. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను మరో ఆరో, ఏడో కలిపి 18 జిల్లాలుగా చేసి ఉంటే చాలా సౌలభ్యంగానూ, సముచితంగానూ ఉండేదని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ వెల్లడిస్తున్న విషయాలు. కానీ అంతకు మించిన భారాన్ని తెలంగాణ ప్రజల నెత్తిన పెట్టి మరీ తను అనుకున్న బంగారు తెలంగాణ ప్రజల సాకారం కోసం తాను 31 జిల్లాల తెలంగాణను బ్రహ్మాండంగా ఆవిష్కరించాడు కెసీఆర్. 

ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ప్రజా పరిపానలో భాగంగా బారీ ఎత్తున అధికార గణం, మిగతా 21 జిల్లాలకు కార్యాలయాలు, అధికార, అనధికార గణాలు తలకు మించిన భారమే అంటున్నారు విశ్లేషకులు. అధినాయకుడికి ఎంత చిత్తశుద్ధి ఉన్నా ఎంతటి పెద్ద జిల్లాల ద్వారా అయినా అభివృద్ధి సాఫీగా సాగుతుంది. అందులో ఎలాంటి మరో అభిప్రాయం లేదు. ఇప్పుడు ఇలాంటి ముక్కలు ముక్కలుగా జిల్లాలు ఏర్పాటు చేసిన కారణంగా రాజకీయ నాయకుల్లోనూ, అధికారుల్లోనూ ప్రాంతీయతా ప్రభావంతో మరీ దగ్గరకు వచ్చేసినట్లుగా భావించి ఇక ఇంట్లోంచే అన్నీ కార్యకలాపాలు చక్కా జరుపుకోవచ్చన్న విషయం అందరికీ అర్థమౌతుంది. అభివృద్ధి భావన అనేది నాయకుడు మనస్సులోనూ, అధికారుల చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది గానీ జిల్లాల మారినంత మాత్రాన జరుగుతుందా అన్నది ఇక్కడ కీలకాంశం. మొత్తాని జిల్లా కేంద్రం ఉన్న ఓ పట్టణంలో కనీసం ప్రాథమిక అవసరాలను తీర్చే సకల సౌకర్యాలు నెలకొల్పగలగాలి. అలా అయినప్పుడే కేసీఆర్ కల సాకారం అయినట్టు. అలా కానప్పుడు ఇలాంటివి ఎన్ని రకాలుగా విభజించినా నిరర్థకమే అవుతాయి. 

ముఖ్యంగా రాజకీయంగా తెలంగాణ కీలకంగా మారి ఆ దిశగా కేంద్రంలో తమ ఉనికిని చాటడానికి మాత్రమే ఈ విభజన కార్యక్రమం పెట్టినట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. నాలుగైదు మండలాలలను ఓ నియోజకవర్గంగానూ, అలాంటి ఐదారు నియోజన వర్గాలను కలిపి ఓ పార్లమెంటును చేసుకుంటూ అలా లోక్ సభ సీట్లను కూడా పెంచి తెలంగాణ తరఫున కేంద్రంలో అధిక ప్రాతినిధ్యాన్ని పెంచుకునేలా కూడా కేసీఆర్ భావించి ఉండే ఉంటారు. అందుకనే ఉన్నఫలంగా అలా ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేశారని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సామాజిక అంచనాలతో కెసీఆర్ తమ పార్టీని తిరుగులేని విధంగా తెలంగాణ సమాజంలో పాతుకుపోయేలా ఇన్ని జిల్లాలను ఏర్పాటు చేశారన్న విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ అంటే తెరాస గుండెచప్పుడు అన్న ధోరణిని ప్రజల నరనరాన జీర్ణించుకొనేలా చేయడానికి ఆరకంగా తమ పార్టీ అన్ని దిశలా అల్లుకుపోయి మరో పార్టీకి అవకాశాన్ని అందించకుండా ఉండేందుకు కూడా కేసీఆర్ పెద్ద ఎత్తున చేసిన ఆలోచనలో భాగంగానే ఈ 31 జిల్లాల ఏర్పాటు జరిగిందని రాజకీయ విశ్లేషకుల భావన. ఇలాంటి పలు సవాళ్ళతో ముందు ముందు ఈ 31 జిల్లాలకు అన్ని రకాలుగా సమాన ప్రాతినిధ్యాన్ని ఇస్తూ సమపాళ్ళలో పరిపాలన జరగాలి. ఆ రకంగా తెలంగాణ పరిపాలన జరగాలని కోరుకుందాం. అలా కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అడుగులు వేస్తే మాత్రం కేసీఆర్ కలకు తలనొప్పి వచ్చేయవచ్చు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement