Advertisement

సోనియమ్మా..రాహుల్ తో వ్యాపారం పెట్టించమ్మా!

Wed 12th Oct 2016 06:57 PM
rahul gandhi,sonia gandhi,business,congress leader video to sonia gandhi,narendra modi,congress  సోనియమ్మా..రాహుల్ తో వ్యాపారం పెట్టించమ్మా!
సోనియమ్మా..రాహుల్ తో వ్యాపారం పెట్టించమ్మా!
Advertisement

భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజులు మకుటం లేని మహారాజులా ప్రధాని పీఠాన్ని అధిరోహించి అందరిని గుప్పెట్లో పెట్టుకుంది. ఇక గత ఎన్నికల్లో బిజెపి విజయ దుందుభి మోగించి మోడీ ప్రధాని అయ్యాక కాంగ్రెస్ దేశం మొత్తం మీదా అక్కడక్కడా తప్ప కొన్ని రాష్ట్రాలలో కనీసం సోదిలోకి లేకుండా పోయింది. పాపం సోనియా గాంధీ ఒక్కతాటి మీద కాంగ్రెస్ ని నడిపించింది. ఇక గత ఎన్నికల తర్వాత సోనియా కి కొంత అనారోగ్యం కారణం గా ఆమె యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొనలేక పోతుంది. ఇక అనారోగ్యం ఒక వైపు మరోపక్క రాహుల్ ని ఎలాగైనా పార్టీ అధ్యక్షుడిని చేసి అతనిని ప్రధానిగా చూడాలని సోనియా తహ తహ లాడుతుంది.

అయితే రాహుల్ ని డైరెక్ట్ గా అయితే రాజకీయాల్లోకి తీసుకురాగలిగింది కానీ..... రాహుల్ ఆమె అంచనాలను అందుకోలేక చతికలపడుతున్నాడు. ఇక ప్రధాని మోడీ ని ఏ విధంగా ఎదుర్కొన లేక డీలా పడుతున్నాడు యువరాజు. ఇక ఎలాగూ పెళ్లి లేకుండా ఒంటరిగా రాజకీయాల్ని ఏలేద్దామనుకున్న రాహుల్ కి అన్ని చోట్ల ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పై ఏ విధంగా కూడా విమర్శనాస్త్రాలు సాధించలేక విలవిలలాడే రాహుల్ తాజాగా ఒక ఇబ్బందిలో పడ్డాడు. అదేమిటంటే దేశం మొత్తం పాకిస్థాన్ చేసే దాడులను తప్పుబడుతున్నారు. పాకిస్థాన్ ఉగ్రదాడికి ఫ్రతీకారంగా మోది ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత సైన్యం వీరోచితంగా సర్జికల్ దాడులు నిర్వహించి పాక్ కు మూడు చెరువులు నీళ్లు తాగించినందుకు గాను ప్రధాని మోడీ తెగువను, సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు. ఇంతటి గొప్ప ప్రధాని మన దేశానికి ఉన్నందుకు తామెంతో గర్వపడుతున్నామని చెబుతుంటే రాహుల్ మాత్రం ఒక సభలో ప్రధాని మోడీ అమర వీరుల రక్తంతో లబ్దిపొందాలని చూస్తున్నారు అంటూ మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. 

ఇంకేముంది రాహుల్ పై దేశం మొత్తం నిరసనలు మొదలయ్యాయి. రాహుల్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందని కాంగ్రెస్ వాళ్ళే నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇక ఒక కాంగ్రెస్ నాయకుడు ఏకం గా... అమ్మా సోనియమ్మా.. మీరు రాహుల్ ని ఇలా ఇష్టం వచ్చినట్లు వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రమాదంలో పడుతుందని.... అయన రాజకీయాలకు పనికి రాకపోతే ఏదైనా ఒక వ్యాపారం పెట్టించండని అని ఒక వీడియో సందేశాన్ని సోనియా గాంధీ కి పంపించాడట. మరి ఈ వీడియో చూసి సోనియా ఎలా రాహుల్ కి బుద్ధి చెబుతుందో.... లేక అలాగే వదిలేస్తుందో చూద్దాం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement