Advertisement

ఇంతకీ అమ్మ వారసులెవరు.?

Sun 09th Oct 2016 09:21 PM
tamilanadu chief minister jayalalita,hero ajith,jayalalita appolo hospital  ఇంతకీ అమ్మ వారసులెవరు.?
ఇంతకీ అమ్మ వారసులెవరు.?
Advertisement

తమిళనాడులో అమ్మగా పిలవబడే జయలలిత వారసుల విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. జయలలిత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె కుటుంబ విషయాల గురించిన సమాచాపం అంతగా ఎవరికీ తెలియదు. అది  పెద్దగా బయటకి కూడా రాలేదు. ఆమెకి పెంపుడు కొడుకు ఉన్నాఅతనితో ఆమెకు గల విపరీతమైన సంబంధాలు అంతగా బయటకు కనిపించవు. ఇటువంటి పరిస్థితుల్లో జయలలిత తీవ్ర అనారోగ్యంతో ఆమె మంచం మీద ఉన్న ఈ సమయంలో ఆమె మేనకోడలు అంటూ దీప అనే కొత్త పాత్ర పేరు ఇప్పుడు వినిపిస్తోంది. తమిళనాడు లో ఆమె జనాలకి కాస్తంత తెలుసుగానీ మనవాళ్ళకి అసలు ఆమె పేరు కూడా తెలీదు. ఆమె జయలలిత సోదరుడికి కూతురట. జయలలిత తీవ్ర అనారోగ్యంతో ఉండగా ఆమెని కలుసుకునే ఛాన్స్ ఇవ్వాలి అంటూ ఆమె ప్రయత్నాలు చేస్తోంది. అధికారులు మాత్రం ససేమిరా అంటూనే ఉన్నారు. కాగా జయలలిత సొంత సోదరుడు జయ కుమార్ పెళ్ళయిన తరవాత కూడా జయ తోనే ఉండేవాడు. దీప పుట్టిన తరవాత ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడి విడిగా వెళ్ళిపోయారు ఆ తరవాత వేరుగా ఉంటున్నారు. 1995 లోనే జయ కుమార్ చనిపోయాడు. మూడేళ్ల కిందట అన్న భార్య (వదిన) కూడా చనిపోయింది. ఆ సమయంలో మాత్రం జయ వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పలకరించలేదు. ఈ మధ్యనే జయ మేనకోడలు దీప పెళ్లి చేసుకుంది. అప్పుడు వారి పెళ్ళికి అమ్మ వెళ్ళకపోగా చివరికి కొత్తదంపుతులే వెళ్ళి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు.

జయలలిత ఆసుపత్రిలో చేరి చాలా రోజులవుతున్నా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికీ పూర్తి స్థాయి వివరణ రాలేదు. పైగా జయలలిత రాజకీయ వారసుల విషయం కూడా చర్చల్లోకి వస్తుంది. మొన్నటి దాకా జయ మేనకోడలు డీప్ పేరు వినిపించగా ఇప్పుడు స్టార్ జీరో అజిత్ పేరు వినిపిస్తోంది. జయలలిత తన వీలునామాలో అజిత్ ను తన రాజకీయ వారసుడిగా పేర్కొందని అంటున్నారు. అజిత్ కూడా జయలలితను తల్లిగా భావిస్తారు. వారిద్దరికీ మధ్య మంచి అనుబంధం కూడా ఉంది.

జయలలిత ఆసుపత్రిలో చేరడానికి కొన్నిరోజుల ముందు అజిత్ ను తన వద్దకు పిలిపించుకుని రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వివరించిందనీ, అజిత్ కూడా అమ్మ మాటను గౌరవించాడని ఇప్పుడు ఒకటే టాక్. జయలలిత రాసిన వీలునామా కూడా ఆమెకు బాగా నమ్మకస్తులైన వ్యక్తుల దగ్గరే ఉందని అంటున్నారు రాజకీయ నాయకులు. ఇకపోతే అమ్మకు బాగా భక్తుడి లాంటి పన్నీర్ సెల్వం ఉండగా అజిత్ ఎందుక అనే ప్రశ్నలు కూడా వినిపిసున్నాయి. వీటికి సమాధానంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలను ఎదుర్కోవాలంటే పన్నీర్ సెల్వంకు ఉన్న జనాకర్షణ చాలదనిఅందుకే అజిత్ ను ఎంచుకున్నారని సమాధానాలు కూడా ముమ్మరంగా వినిపిస్తున్నాయి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement