Advertisementt

దీపావళి వాళ్ళ చేతుల్లోకి...!

Sun 09th Oct 2016 08:23 PM
deepavali,kodi,kaashmora,deepavali release movies,okkadochhadu,bethaludu  దీపావళి వాళ్ళ చేతుల్లోకి...!
దీపావళి వాళ్ళ చేతుల్లోకి...!
Advertisement
Ads by CJ

మన పెద్ద స్టార్స్‌ ఈ దసరాను వదిలేశారు. దాంతో దసరా కానుకగా వచ్చిన 'ప్రేమమ్‌' చిత్రం ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడంలో బిజీగా ఉంది.ఈ చిత్రానికి మొదటి రోజున హిట్‌ టాక్‌ వచ్చింది. ఇక 'మన ఊరి రామాయణం', 'ఈడు గోల్డ్‌ ఎహే' చిత్రాలకు కూడా మంచి టాక్‌ వచ్చింది. దీంతో చిన్నహీరోలు ఈ దసరాకు తమ సత్తా చాటుకున్నారు. ఇక వచ్చే దీపావళిని మనస్టార్స్‌ తమిళ హీరోలకు రాసిచ్చారు. వచ్చే దీపావళికి కూడా మన టాలీవుడ్‌ను తమిళ హీరోలు ఒడిసిపట్టుకుంటున్నారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు తమిళ హీరోలు తమ చిత్రాలను రిజర్వ్‌ చేసుకున్నారు. 'ఊపిరి' చిత్రం ద్వారా పివిపితో మరోసారి 60కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'కాష్మోరా' చిత్రం దీపావళికి రానుంది. గోకుల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక విశాల్‌, తమన్నా తో కలిసి రానున్నాడు. ఆపై 'బిచ్చగాడు' హీరో విజయ్‌ ఆంటోని నటించిన 'బేతాళుడు' కూడా దీపావళికే విడుదలకానుంది. ఇక 'రఘువరన్‌బి.టెక్‌' తర్వాత టాలీవుడ్‌పై వరుస దాడులు చేస్తున్న ధనుష్‌ తమిళంలో 'కోడి'ని తెలుగులోకి కూడా అనువదిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేయడం, పొలిటికల్‌ సెటైరిక్‌ ఫిల్మ్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇలా రాబోయే దీపావళి తమిళ డబ్బింగ్‌ చిత్రాలతో మన థియేటర్లు దద్దరిల్లనున్నాయి. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ