అక్టోబర్ 5 సస్పెన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ ది!

Tue 04th Oct 2016 01:29 PM
prabhas,wax statue,jr ntr,kalyan ram,brothers,ntr arts  అక్టోబర్ 5 సస్పెన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ ది!
అక్టోబర్ 5 సస్పెన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ ది!
Sponsored links

రీసెంట్ గా జరిగిన 'బాహుబలి 2' ప్రెస్ మీట్ లో అక్టోబర్ 5న ప్రభాస్ గురించి ఒక గొప్ప వార్త తెలియబోతుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఆయన అలా చెప్పిన మరుసటి రోజే అంటే 4 రోజుల ముందే ఆ న్యూస్ మీడియాకి తెలిసిపోయింది. అదేమిటంటే బ్యాంకాక్ లో మేడం టూసాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు ప్రతిమ ప్రతిష్టించబోతున్నారని. ఇక ప్రభాస్ కి ఒక అరుదైన గౌరవం దక్కబోతుందని 4 రోజుల ముందే రివీల్ అవ్వడంతో...అక్టోబర్ 5 సస్పెన్స్ కి తెరపడింది. అయితే అదే రోజు మరో సంచలన న్యూస్ రాబోతుందని ప్రచారం జరుగుతుంది. అదీ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కావడంతో..ప్రభాస్ సస్పెన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ న్యూస్ కూడా కొంచెం కొంచెంగా  బయటికి వచ్చేసింది. దీనిలో నిజమెంతో తెలియదుగాని ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో మాత్రం ఒకటే న్యూస్ హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే  కళ్యాణ్ రామ్ , జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక చిత్రం చేయబోతున్నారని. అదేమిటి వీరిఇద్దరూ కలిసి నటిస్తారని ఎప్పుడో చెప్పారుగా అంటారా. అదేనండి వీరిద్దరూ కలిసి 'బ్రదర్స్' అనే సినిమాలో కనిపించబోతున్నారని అంటున్నారు. 

అయితే ఇప్పుడు ఈ న్యూస్ రావడానికి ప్రధాన కారణం మాత్రం కళ్యాణ్ రామ్ తన ఓన్ బ్యానర్ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై 'బ్రదర్స్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించడమే. దీంతో ఈ 'బ్రదర్స్' టైటిల్ ఈ అన్నదమ్ముల కోసమే అని ప్రచారం మొదలైంది. మరి ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ..ఎన్టీఆర్ కి అన్నగా  కనిపిస్తాడని అంటున్నారు. మరి ఇదే నిజమైతే ఈ  సినిమాకి డైరెక్టర్ సెట్ కావాల్సి ఉందని..... అయితే ఇప్పటికే వంశీ వక్కంతం కథ ఎన్టీఆర్ దగ్గరే ఉన్నప్పటికీ... వంశీతో కలిసి పని చెయ్యడానికి ఎన్టీఆర్ ఇంకా డిసైడ్ కాలేదని అందుకే ఇంకా ఆలోచనలోనే వున్నదని అంటున్నారు. అయితే మరో పక్క అనిల్ రావిపూడితో కూడా ఎన్టీఆర్ సినిమా చెయ్యాలని సిద్ధమవుతున్నాడనే వార్తలొస్తున్నాయి.

అయితే ఈ విషయం రూమరా లేక నిజమేనా అన్నది మాత్రం అక్టోబర్ 5 న జరగనున్న 'ఇజం' ఆడియో వేడుకలో ఒక క్లారిటీ ఇస్తారని అంటున్నారు. ఇక 'ఇజం' ఆడియో వేడుకకి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడని సమాచారం. కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ ఎప్పటి నుండో ఒక సినిమాలో నటించాలని అనుకుంటున్నారు. మరి అందుకోసమే ఈ 'బ్రదర్స్' టైటిల్ ని రిజిస్టర్ చేయించారని కూడా కొందరు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఏ విషయమైనా అక్టోబర్ 5 దీనిపై ఫుల్ క్లారిటీ మాత్రం వచ్చేస్తుందని నందమూరి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019