Advertisement

పాక్ లో భారతీయ సినిమాలు, మీడియాపై వేటు..!

Mon 03rd Oct 2016 06:14 PM
pakistan,media,indian news channels,ban,bollywood movies  పాక్ లో భారతీయ సినిమాలు, మీడియాపై వేటు..!
పాక్ లో భారతీయ సినిమాలు, మీడియాపై వేటు..!
Advertisement

భారత్ సరిహద్దు రేఖ దాటి భారత సైనికులు మూడు కిలోమీటర్లు పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి యూరిలో ఉగ్ర‌వాద శిబిరాల‌పై స‌ర్జిక‌ల్ ఆప‌రేష‌న్ దిగ్విజ‌యంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రశంసలందుకుంది.  అన్ని దేశాలు ఇండియాకి మద్దతు ఇవ్వడంతో పాకిస్తాన్ ప్రస్తుతం ఏమీ చేయ‌లేని స్థితిలో ఉంది.  

ఇదిలా ఉండగా పాక్ ప్ర‌భుత్వం పాకిస్తాన్ లోని భారత సంబంధిత కళలపై, మీడియాపై వేటు వేసింది. అక్కడ ఉన్న మన మీడియాను, సినిమాలను నిషేధించింది. ఇక నుండి పాకిస్తాన్ లో బాలీవుడ్ సినిమాలు ఆడేలా వాతావరణం కనిపించడం లేదు. ఇక ఇండియ‌న్ టీవీ చానెళ్ల‌లో వార్తా ప్ర‌సారాలు పూర్తిగా నిలిచిపోయిన‌ట్టే అని తెలుస్తుంది. మ‌న చానెళ్ల‌పై నిషేధం నిరంతరాయంగా కొన‌సాగుతుందని, లోక‌ల్ ఎంఎస్ఓలు దీని అమలుపై విఫ‌ల‌మైతే అక్టోబ‌ర్ 15వ తేదీ నుండి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొనేందుకు సిద్ధమని పాక్‌.... ఈ మీడియా రెగ్యులేట‌రీ హెచ్చ‌రికలు జారీ చేసింది.

ఇంక భార‌తీయ క‌ళాకారులు పాకిస్తాన్‌లో ప‌నిచేయ‌కుండా నిషేధించాలా? వ‌ద్దా? అనే విషయంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ అంశంపై ఓటింగ్ జరపగా ఇండియా కళాకారులపై నిషేధం విధించాలని 3,185 మంది ఓట్లు వేయగా, వారిపై నిషేధం సరికాదని 3,157 మంది ఓట్లు వేశారు. అయితే పాకిస్తాన్ ప్ర‌భుత్వం ఎంత కుట్రలు పన్నుతున్నా, ఎంత దుగజారుడు రాజకీయాలు చేస్తున్నా స్థానిక ప్ర‌జ‌లు మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement