Advertisement

ప్రత్యేక హోదాపై వెంకయ్య కొత్తపాట...!

Sun 02nd Oct 2016 10:07 PM
venkaiah naidu,special status,ap,language  ప్రత్యేక హోదాపై వెంకయ్య కొత్తపాట...!
ప్రత్యేక హోదాపై వెంకయ్య కొత్తపాట...!
Advertisement

కేంద్రప్రభుత్వం అన్ని అంశాలను పక్కన బెట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటుంటే  దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయని అందుకే కేంద్రం హోదా విషయంలో ససేమిరా అంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశాడు.  దేశంలోని ఓ తొమ్మిది రాష్ట్రాలు ఏపీకి పోటీగా ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాయని ఆ కారణంతో కేంద్రం ఈ విషయాన్ని పక్కనబెట్టిందని వెంకయ్యనాయుడు ఇప్పటివరకు ప్రకటించని కొత్త విషయాన్ని వెల్లడించాడు. ప్రత్యేక ప్యాకేజీ అనే అంశంపై తిరుపతిలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. ఈ విషయాలను తెలిపాడు. అధిక శాతం గిరిజనులున్న కొండ ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాలు, అన్ని రకాలుగా వెనుకబడిన ప్రాంతాలను వీటిన్నింటినీ ప్రాతిపదికగా తీసుకుని ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తారని, ఆ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ మరీ అంతగా వెనకబడ్డ ప్రాంతం కాదని, అది దృష్టిలో పెట్టుకొనే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని ఆయన వివరించాడు.  ఇంకా ఆయన మాట్లాడుతూ..  తాను ఏపీ నుంచి ఎంపిక కాకపోయినప్పటికీ కూడా తనకు గల ప్రాంతీయాభిమానంతో పట్టుబట్టి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చానన్నాడు. ఇంకా తానేగాని పట్టుబట్టకపోయి ఉన్నట్లయితే ఇది కూడా వచ్చుండేది కాదని ఆయన తెగేసి చెప్పాడు. అయితే ఇక్కడ అర్థం కాని విషయమేమంటే వెనకబడిన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ప్రకటించింది. అది ఓకే... అందులో వెంకయ్య పోరాడటం కారణంగానే ఇది ఇచ్చారని చెప్పడం కూడా ఇక్కడ పార్టీలకు, నేతలకు అంతుపట్టకుండా ఉంది.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement