Advertisementt

తమిళ దర్శకుల్ని లైన్లో పెడుతుంది అందుకే!

Fri 30th Sep 2016 09:02 PM
murugadoss,linguswami,maniratnam,ram charan,allu arjun,mahesh babu,industry,producers  తమిళ దర్శకుల్ని లైన్లో పెడుతుంది అందుకే!
తమిళ దర్శకుల్ని లైన్లో పెడుతుంది అందుకే!
Advertisement
Ads by CJ

స్టార్‌హీరోల సినిమాల బడ్జెట్‌ విపరీతంగా పెరిగింది. ఓ స్టార్‌తో సినిమా చేయాలంటే 50, 60 కోట్లు కూడా చాలడం లేదు. మరి ఇంత బడ్జెట్‌ పెట్టి కేవలం టాలీవుడ్‌లో మాత్రమే రిలీజ్‌ చేయడం కష్టతరం అయిపోయింది. దీంతో మన దర్శకనిర్మాతలు, స్టార్స్‌ ఇతర ఇండస్ట్రీలపై కన్నేశారు. మలయాళం, తమిళ మార్కెట్‌లతో ముందుకు పోవాలనే నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకే అరవ దర్శకులపై మన స్టార్స్‌ కన్నుపడింది. తాజాగా మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ నటిస్తున్న చిత్రం ఈ కోవకు చెందిందే. టాలీవుడ్‌లో మహేష్‌ను చూసి, కోలీవుడ్‌లో మురుగదాస్‌లను చూసి ఈ చిత్రం రెండు భాషల్లో క్రేజ్‌కు కారణమైంది. ఇక బన్నీ అయితే లింగుస్వామితో సినిమాకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. మలయాళంలో కూడా స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న బన్నీ తాజాగా తమిళ మార్కెట్‌పై కన్నేశాడు. ఇక రామ్‌చరణ్‌తో 'ఓకే బంగారం' చేయాల్సిన మణిరత్నం ఆ చిత్రం చేయలేదు. కాగా త్వరలో మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం చేయానికి రామ్‌చరణ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఇలా తమిళ మార్కెట్‌పై కూడా కన్నేసి తమ నిర్మాతలకు బిజినెస్‌ పరంగా మరింత హెల్ప్‌ చేయాలని స్టార్స్‌ భావిస్తుండటం శుభపరిణామం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ