Advertisementt

'ఓం నమో వేంకటేశాయ' చిత్రాలివిగో..!

Fri 30th Sep 2016 01:48 PM
om namo venkatesaya,om namo venkatesaya movie new pics,nagarjuna,krr twitter  'ఓం నమో వేంకటేశాయ' చిత్రాలివిగో..!
'ఓం నమో వేంకటేశాయ' చిత్రాలివిగో..!
Advertisement
Ads by CJ

'ఓం నమో వేంకటేశాయ' తో నాగార్జున మరోసారి భక్తి రస చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోతున్నాడు. ఈ సినిమాని 'అన్నమయ్య, శ్రీరామదాసు' తో భక్తి చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచిన కె.రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తున్నాడు. ఇక నాగార్జున ఈ సినిమాలో హాథిరామ్ బాబాగా... వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా కనిపించనున్నాడు. మరో భక్తురాలిగా అనుష్క కనిపించనుంది. ఇప్పటికే కృష్ణమ్మ గా అనుష్క ఫస్ట్ లుక్ అందరిని అలరించింది. ప్రగ్యా జైస్వాల్ కూడా  ఈ సినిమాలో నటిస్తుంది. ఈ 'ఓం నమో వేంకటేశాయ' సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా  జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియాలో వేసినసెట్స్ లో ఈ సినిమా కు సంబందించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తున్నాడు. 

ఈ సన్నివేశాలకు సంబంధించి కొన్ని ఫొటోస్ ని రాఘవేంద్రరావు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అందులో నాగార్జున బాగా గెడ్డం పెంచి అచ్చమైన భక్తుడిగా కనిపిస్తున్నాడు. ఆ భక్తుడి రూపం లో నమస్కారం చేస్తూ అక్కడ నాగార్జున వున్నాడు. మరో వైపు బ్రహ్మనందం ,నాగార్జున కూడా రాఘవేంద్ర రావు తో వున్న ఫొటోస్ కూడా అందులో వున్నాయి. ఇప్పటికే అనుష్క, నాగార్జున, వేంకటేశ్వర స్వామి పాత్రలలో వున్న ఫస్ట్ లుక్ తో అలరించిన ఈ 'ఓం నమో వేంకటేశాయ' ఇప్పుడు ఈ ఫొటోస్ తో ఈ సినిమాపై ఇంకా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. మరి 'అన్నమయ్య, శ్రీరామదాసు'తో హిట్ కొట్టిన నాగార్జున ఇప్పుడు 'ఓం నమో వేంకటేశాయ' తో మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడన్నమాట. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ