Advertisement

కాలాన్ని బట్టి కాంప్రమైజ్ కావాలి మరి..?

Thu 29th Sep 2016 07:40 PM
raviteja,no movies to raviteja,kick 2,bengal tigers,raviteja remuneration  కాలాన్ని బట్టి కాంప్రమైజ్ కావాలి మరి..?
కాలాన్ని బట్టి కాంప్రమైజ్ కావాలి మరి..?
Advertisement

రవితేజ అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. అసలు కొన్ని సంవత్సరాలైతే అది రవితేజ  కాలమా అన్నట్టు పరిశ్రమలో నడిచిన రోజులున్నాయి.  రవితేజ ‘కిక్ 2’ లో బాగా సన్నగా కనిపించాడు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది. కిక్ 2 సినిమా జనాలకు అంతగా ఎక్కలేదు. తర్వాత కాస్త కుస్తీలు చేసి మరీ బరువు పెరిగి ‘బెంగాల్ టైగర్’ సినిమా  చేసాడు. ఆ సినిమా కాస్త పర్వాలేదు కానీ అదీ బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. దానికి కారణం రవితేజనే. ‘బెంగాల్ టైగర్’ సినిమా విడుదలై సంవత్సరం దాటినా రవితేజ తర్వాత సినిమా ఏదీ ఇంతవరకు సెట్స్ పైకి వచ్చిన దాఖలాలు లేవు. బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ  చాలా కథలు వింటున్నాడు, ఓకే చేసుకుంటున్నాడు గానీ, పక్కాగా ఆయన సినిమా ఒక్కటి కూడా ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  అప్పట్లో దిల్ రాజుతో రవితేజ సినిమా అని టాక్ వచ్చినా తర్వాత ఏ విషయంలోనే అది ఆగిపోయింది. కానీ తర్వాత ఆయనతో సినిమా ఆగిపోవడానికి కారణం రెమ్యునరేషన్ అని తెలిసిందే.  రవితేజ పదికోట్ల వరకు తన రెమ్యూనరేషన్ ను అడిగినట్లు తెలుస్తుంది. వరుస ప్లాప్ ల కారణంగా రవితేజ రెమ్యూనరేషన్ తగ్గిపోవడంతో సక్సెస్ మీదున్నప్పడు ఎంత డిమాండ్ చేశాడో అంతే లెక్కల్లో ఉండటంతో నిర్మాతలు రవితేజతో సినిమా తీయడానికి వెనకడుగు వేస్తున్నారని టాక్ వినిపించింది.  ఆ కారణంగానే బెంగాల్ టైగర్ సినిమా విడుదలై సంవత్సరమైనా గానీ, ఓ ఒక్కటి కూడా రవితేజ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదని కూడా అర్థమౌతున్న విషయం. అంతే కాకుండా రవితేజకు ముగ్గురు, నలుగురు దర్శకులు కథలు  వినిపించినా అది  రవితేజ విని ఓకే చేసినా గానీ ఇంతవరకు ఏ ఒక్కటీ సెట్స్ పైకి వెళ్ళడం లేదంటే కారణం అదేనని కూడా తెలుస్తున్న అంశం.  మరి  రవితేజ ఆ విషయం గ్రహించినట్లుగానే అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. నిర్మాతలెవరూ సినిమా తీయడానికి ముందుకు రాకపోవడంతో రవితేజ దిగివచ్చి రెమ్యూనరేషన్ ను తగ్గించినట్లు పరిశ్రమ వర్గాల టాక్ వినిపిస్తుంది. రవితేజ ఒక్కసారిగా ఆయన రెమ్యూనరేషన్ ను రెండు కోట్లు తగ్గించాడంట.  కాగా అంత తగ్గించడంతో రవితేజ ఇప్పటికైనా ఆయన సినిమా సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా ఆలస్యం అవుతుందో చూడాలి. ఎంతైనా లేట్ లేటే. కాలాన్ని బట్టి కాంప్రమైజై పరిగెత్తాలి తప్ప... గతించిన కాలాన్ని తిరిగి పట్టుకోలేం కదా. జీవితంలో కాంప్రమైజ్ అవసరమే. జీవితానికి కాంప్రమైజ్ కానవసరం లేదు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement