Advertisementt

నాగ్ మాటలతో చైతూ పిచ్చ హ్యాపీ..!

Wed 28th Sep 2016 06:53 PM
nagarjuna,premam,premam special show for nagarjuna,nagarjuna twit,naga chaitanya,dasara  నాగ్ మాటలతో చైతూ పిచ్చ హ్యాపీ..!
నాగ్ మాటలతో చైతూ పిచ్చ హ్యాపీ..!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య ఈ మధ్యన చేతినిండా సినిమాలతో తెగ బిజీ గా మారిపోయాడు. ఇప్పుడు ఆయన సినిమాలు రెండు రిలీజ్ కి సిద్ధమయ్యాయి. ఒకటి 'ప్రేమమ్' కాగా రెండోది 'సాహసం శ్వాసగా సాగిపో'. వాటిల్లో 'ప్రేమమ్' చిత్రం ఈ దసరాకి విడుదల చెయ్యడానికి ఆ చిత్ర యూనిట్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెడీ గా వుంది. ఇక ఈ సినిమాని మలయాళం లో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' సినిమాకి రీమేక్ గా అదే పేరుతో తెలుగులో నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం లో తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం లో నాగ చైతన్యకి జోడిగా శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 7న ప్రేక్షకులని పలకరించడానికి సిద్ధమైంది.

అయితే విడుదలకు సిద్ధమైన ఈ 'ప్రేమమ్' చిత్రాన్ని నాగ చైతన్య స్పెషల్ గా ఒక షో వేయించి తన తండ్రి నాగార్జునకి చూపించాడని సమాచారం. అయితే సినిమా ఆధ్యంతం తిలకించిన నాగార్జున కి ఈ 'ప్రేమమ్' చిత్రం బాగా నచ్చిందని.... ప్రతి సీన్ ని ఆయన బాగా ఎంజాయ్ చేసాడని అంటున్నారు. సినిమా చూసిన నాగ్  'ప్రేమమ్' చిత్ర యూనిట్ ని పొగడ్తలతో ముంచి లేపాడని... నాగ చైతన్యని స్పెషల్ గా అభినందించాడని అంటున్నారు. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ కి ప్లస్ అవుతుందని కూడా చెప్పాడని అంటున్నారు. ఇక సినిమా నుండి బయటికి వచ్చాక ఆయన తన ట్విట్టర్ ద్వారా ఇప్పుడే నాగ చైతన్య 'ప్రేమమ్' చూశానని... హ్యాపీ గా ఇంటికెళుతున్నాని ట్వీట్ చేసాడట. మరి నాగార్జునే సినిమా సూపర్ అని చెప్పాక.. నాగ చైతన్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అందుకే టెన్షన్ లేకుండా హ్యాపీగా వున్నాడని టాక్. అంటే చైతూ ఈసారి దసరా బరిలో హిట్ కొట్టడానికి సిద్ధమైపోయాడన్నమాట. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ