మాస్క్‌లకు డిమాండ్‌ పెంచుతున్నారు!

Tue 27th Sep 2016 07:05 PM
mask,kalyan ram ism,eedu gold ehe,sunil,kick movie,demand for masks  మాస్క్‌లకు డిమాండ్‌ పెంచుతున్నారు!
మాస్క్‌లకు డిమాండ్‌ పెంచుతున్నారు!
Advertisement

హీరోల ఫేస్‌లకు మాస్క్‌లు వేయించడం ఈమధ్యకాలంలో బాగా ఎక్కువైంది. రవితేజ 'కిక్‌'లో మాస్క్‌తోనే దొంగతనాలు చేశాడు. ఇక ప్రస్తుతం పూరీజగన్నాద్‌ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న 'ఇజం' చిత్రంలో కూడా కళ్యాణ్‌రామ్‌కు మాస్క్‌లు వేశారు. ఇక ఇప్పుడు విడుదలకు సిద్దమవుతోన్న వీరుపోట్ల దర్శతక్వంలో సునీల్‌ హీరోగా ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్ద నిర్మిస్తోన్న 'వీడు గోల్డ్‌ ఎహే' ట్రైలర్‌లో సునీల్‌ చేత దర్శకుడు ఎక్కువగానే మాస్క్‌లు వేయించాడు. ఈ చిత్రం ట్రైలర్‌ చూస్తుంటే అచ్చం 'కిక్‌' ఫార్ములాతోనే 'వీడు గోల్డ్‌ ఎహే' తెరకెక్కిన ఫీలింగ్‌ ట్రైలర్‌ చూసిన ప్రేక్షకులకు కలుగుతుంది. మొత్తానికి మన హీరోలు మాత్రం తమ మొహాలకు మాస్క్‌లు వేసుకొని తమకు సాధ్యమైన అన్ని విధాలుగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ ముసుగు హీరోల చిత్రాలు ఎలా ఆడియన్స్‌ను అలరిస్తాయో వేచిచూడాల్సివుంది. 


Loading..
Loading..
Loading..
advertisement