Advertisement

మీడియాని ఆడేసుకున్నాడంట..!

Tue 27th Sep 2016 03:24 PM
media,puri jagannadh,ism movie,puri target media,director puri  మీడియాని ఆడేసుకున్నాడంట..!
మీడియాని ఆడేసుకున్నాడంట..!
Advertisement

పూరి జగన్నాధ్ ఏం చేసినా చాలా స్ట్రైట్ గా చేస్తాడు. సూటిగా మాట్లాడుతాడు. సున్నితమైన విషయాలపై ఆయన వెల్లడించే డైలాగ్ లు, భావాలు సూదిలా ప్రేక్షకుల్ల మెదల్లో దిగబడేలా ఉంటాయి. అలాంటి గొప్ప దర్శకుడు పూరి జగన్నాధ్. ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్నాడు కాళోజి. నిజంగా పూరి మనస్సుకు పదును చేసే భావాలు, పేపరు చుట్టి ఆయన రాసే వాక్యాలకు అంత పదును ఉంటుంది. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు అవి విని ఎంత ప్రభావితమౌతారో చెప్పడానికే సాధ్యం కాదు. పూరి జగన్నాధ్ ప్రస్తుతం ఇజం చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈసారి పూరి ఇజం సినిమా ద్వారా మీడియాపై దాగిన నిజాలను, రహస్యాలను బయటపెట్టడం జరిగిందని టాక్.

పూరి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ‘ఇజం’ చిత్రం అక్టోబర్ 7వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్ లో రెండు షేడ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఓ క్యాకెర్టర్ లో  మీడియా రిపోర్టర్ గా క‌నిపించనున్నాడు క‌ల్యాణ్‌రామ్. ప్రధానంగా మీడియా బాధ్యతలు ఏంటి? అన్న అంశంపైనే చాలా పెద్ద సీన్ ఒకటి ఉందని టాక్.  అందులో ఆ పాత్ర ద్వారా మీడియాకు సంబంధించిన రహస్య కార్యకలాపాలు, ఏమీ లేని చోటకూడా సంచలనాంశాలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయాలపై పూరి రాంగోపాల్ వ‌ర్మ సలహా సూచనలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. సంచలనాంశాలు, మైలేజ్ లు వంటి విషయాల కోసం మీడియా ఎంతకు దిగజారుతుంది అనే అంశాలతో వ్యంగ్యంగా చిత్రీకరించినట్లు తెలుస్తుంది. పూరి ఇజం కాస్త తెలివిగా కూడా వ్యవహరించాడంటు కూడా టాక్ వినిపిస్తుంది. కొంత వ్యంగ్యం, కొంత సానుకూలంగా మీడియా అంశాలను పెట్టినట్లు తెలుస్తుంది. ఒకవేళ సినిమా అటు ఇటు అయితే మీడియా నుంచే ప్రతిఘటన ఎదురౌతుందన్న భయంతో బేలెన్స్ చేసి ఇజం ను తెరకెక్కించినట్లు కూడా అర్ధమౌతుంది. మొత్తానికి పూరి జగన్నాధ్ ఈ సినిమాతో మీడియా పట్ల తనకున్న అక్కసునంతా తీర్చుకున్నట్లు అర్థమౌతుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement