ఐష్ ముందు వాళ్ళు తేలిపోయారు..!

Sat 24th Sep 2016 08:40 PM
aishwarya rai,ye dil hai mushkil,ranbir kapoor,anushka sharma,aish  ఐష్ ముందు వాళ్ళు తేలిపోయారు..!
ఐష్ ముందు వాళ్ళు తేలిపోయారు..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని కన్న తర్వాత కూడా ఐష్ సినిమా ల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇక ఇప్పుడు ఐశ్వర్య - రణబీర్ కపూర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది.  ‘ఏ దిల్ హై ముష్కిల్’ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క శర్మ కూడా ఒక ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇక రణబీర్ కపూర్.. ఐష్ కంటే దాదాపు 9 సంవత్సరాలు  చిన్నవాడు. అలా చిన్న వాడైనా రణబీర్ తో  ఐశ్వర్య ఈ సినిమాలో రెచ్చిపోయి నటిస్తుందని ఇప్పటికే బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇలాంటి టైం లో ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ ని విడుదల చేసింది ఆ చిత్ర యూనిట్. కేవలం 20 గంటల్లోనే 25 లక్షల కు పైగా హిట్స్ వచ్చాయని ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్ర యూనిట్ తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. 

పెళ్ళైన తర్వాత పద్దతిగా నటిస్తుందని అనుకున్న వారంతా ఈ సినిమా ట్రైలర్స్ చూసిన వారంతా ఆమ్మో ఐష్ లో ఇంకా రొమాంటిక్  యాంగిల్ చావలేదుగా అని తెగ సంతోష పడిపోతున్నారు. అయితే రణబీర్ తో రొమాంటిక్ సీన్స్ లో నటిస్తుందని ఐష్ ని అమితాబ్ కోప్పడినట్లు.... ఆమె కుటుంబం లో దీని వల్ల విభేదాలు వచ్చినట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది. ఇక ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా  డైరెక్టర్ కరణ్ జోహార్ ని పిలిచి అమితాబ్ వార్నింగ్ ఇచ్చినట్లు పుకార్లు వచ్చాయి. మరి ఈ విషయం లో అమితాబ్ ఫ్యామిలీ మాత్రం మీడియాకి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఇక  కరణ్ జోహార్ ఈసారి ట్రైలర్ లో మొత్తం అనుష్క శర్మనే చూపించినట్టే చూపించి... క్రమేణా ఐష్ కి పెద్ద పీట వేశాడు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య అటు రణబీర్ ని ఇటు అనుష్కని డామినేట్ చేసే విధం గా నటించిందని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ