Advertisementt

కొరటాల తప్పు చేశానని చెప్పుకుంటున్నాడు!

Sat 24th Sep 2016 01:41 PM
koratala siva,srimanthudu,srimanthudu climax,bahubali,srimanthudu climax scene  కొరటాల తప్పు చేశానని చెప్పుకుంటున్నాడు!
కొరటాల తప్పు చేశానని చెప్పుకుంటున్నాడు!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - కొరటాల కాంబినేషన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికి తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ కి అతిపెద్ద రెండో హిట్ గా నిలిచింది. మొదటి స్థానం లో రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' ఉండగా రెండో స్థానం లో 'శ్రీమంతుడు' వుంది. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ 'శ్రీమంతుడు' కలెక్షన్స్ పరంగా అతి పెద్ద హిట్ యైన సినిమా గా నిలిచింది. అయితే ఇపుడు ఈ సినిమా గురించి ఒక వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే 'శ్రీమంతుడు' క్లైమాక్స్ గనక కొంచెం మార్చినట్లైతే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యి 'బాహుబలి' దగ్గరలో నిలబడేదని చెప్పుకుంటున్నారు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే 'శ్రీమంతుడు' క్లైమాక్స్ బాగోలేదని అభిప్రాయాలు వెల్లడయ్యాయని అంటున్నారు. సినిమా చివరిలో ఎమోషనల్ సీన్ వచ్చిన వెంటనే పెద్ద ఫైటింగ్ తో సినిమా కంప్లీట్ అవ్వడం బాగోలేదని అన్నారు. అలా ఎమోషన్ సీన్ తోనే సినిమా కంప్లీట్ చెయ్యాల్సిందని ఎవరికి తోచినట్టు వారు అన్నారట. అయితే ఈ సినిమా హిట్ తో అటు మహేష్ గాని ఇటు కొరటాల గాని ఆ వ్యాఖ్యలని పెద్దగా పట్టించుకోలేదని.....ఇప్పుడు దీని గురించి కొరటాల స్పందించాడని అంటున్నారు. మరి ఇన్నాళ్ళకి కొరటాల ఇప్పుడు 'శ్రీమంతుడు'  క్లైమాక్స్ ని కొద్దిగా మారిస్తే ఇంకా బావుండేదని అంటున్నాడని సమాచారం. అలా చివరిలో భారీ ఫైట్ పెట్టి ఉండాల్సింది కాదని ఆ ఎమోషన్ డ్రామాతోనే సినిమాని కంప్లీట్ చెయ్యాల్సిందని అది తప్పే అని ఓపెన్ గా తన తప్పుని ఒప్పుకుంటున్నాడట. ఏ విషయమైనా అలా ఓపెన్ గా మాట్లాడే శివ ఇప్పుడు 'శ్రీమంతుడు' క్లైమాక్స్ లో కూడా తన తప్పుని ఒప్పుకుని మరోసారి గ్రేట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ