డైరెక్టర్ మారుతి కొత్త వ్యాపారం..!

CineJosh news

భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు మారుతి తాజాగా వెంకటేష్ తో బాబు బంగారం వంటి  చిత్రాన్ని చేసి దాంతో  క్రేజీ దర్శకుడుగా మారిపోయాడు. కాగా ఇప్పటికే సినీరంగంలోని చాలా మంది హీరోలు హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, రచయితలు కూడా సైడ్ బిజినెస్ లు అంటూ పలు రకాల వ్యాపారాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలా వివిధ రంగాలలో ప్రవేశించి ఆదాయాన్ని పెద్ద ఎత్తున ఆర్జిస్తున్నారు.   

వ్యాపార రంగంలోకి ప్రవేశించిన చాలా మంది టాలీవుడ్ స్టార్స్ మంచి క్రేజ్ ను తెచ్చుకొన్నారు. వారిలో నాగార్జున, రామ్ చరణ్ లాంటి వారు గురించి ఇక చెప్పక్కరలేదు. అయితే ఇప్పటికే రెస్టారెంట్ వ్యాపారంలో నాగార్జున, శర్వానంద్, మంచు లక్ష్మి, కూచిపూడి వెంకట్ లాంటి వారు వ్యాపారాలు మొదలు పెట్టేసి ముమ్మరంగా బిజినెస్ లు కూడా చేసుకుంటున్నారు. ఇక తాజాగా కొందరు స్టార్స్ హోటల్ రంగంలోకి అడుగులు వేస్తూ అక్కడ తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ సరసన  చేరేందుకు సిద్ధం అవుతున్నాడు క్రేజీ దర్శకుడు మారుతి.  ప్రస్తుతం ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న మారుతి బంజారా హిల్స్ లో ఓ రెస్టారెంట్ ని మొదలు పెడుతున్నాని టాక్. ఇప్పటికే దానికి సంబందించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయని తెలుస్తుంది. త్వరలోనే అంటే దసరా రోజున ఈ హోటల్స్ మొదలు పెట్టాలనే ఆలోచనలో కూడా మారుతి ఉన్నట్లు విశ్వసనీయంగా వచ్చిన సమాచారం. కాగా త్వరలోనే దీనికి సంబందించిన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దర్శకుడు మారుతి కూడా బిజినెస్ లో పడుతున్నాడన్న మాట. 

maruthi
director maruthi
maruthi enters into hotel business
maruthi hotel business