Advertisement

ఐటి ఎటాక్ తోనైనా అణుకువగా వుంటారా!

Thu 22nd Sep 2016 07:54 PM
it attack,sai korrapati,vaarahi chalana chitram,it raids  ఐటి ఎటాక్ తోనైనా అణుకువగా వుంటారా!
ఐటి ఎటాక్ తోనైనా అణుకువగా వుంటారా!
Advertisement

సాయి కొర్రపాటి.. వారాహి చలన చిత్ర బ్యానర్ లో ఎన్నో సూపర్ హాట్ సినిమాలు అందించాడు. 'ఈగ, లెజెండ్, ఊహలు గుసగుసలాడే' వంటి సినిమాలు ఆ బ్యానర్ లో వచ్చినవే. ఇక ఇప్పుడు తాజాగా నారా రోహిత్, నాగ సౌర్య, రెజీనా జంటగా వచ్చిన 'జ్యో అచ్యుతానంద' కూడా సాయి కొర్రపాటి నిర్మించిన సినిమానే. ఈ సినిమా కూడా విడుదలైన దగ్గర నుండి పాజిటివ్ టాక్ తో రన్ అవుతూ మంచి కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకుపోతుంది. మరి ఇన్ని సినిమాలు హిట్ అయ్యి ఒక పెద్ద ప్రొడ్యూసర్ గా ఎదిగిన సాయి కొర్రపాటి పై ఐటి దృష్టి పడింది.

ఐటి శాఖవారు సాయి కొర్రపాటి ఆఫీసుపై, ఇంటిపై.... మొతం 9 చోట్ల నిన్న (బుధవారం) సాయంత్రం ఏకకాలం లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటిపైనే కాకుండా కొర్రపాటి బంధువుల ఇళ్లపై కూడా ఐటి శాఖ దాడులు నిర్వహించింది. చాలా పత్రాలను, రికార్డులను  ఐటి శాఖ తనిఖీ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆయన తీసినవి మంచి సినిమాలు, కలెక్షన్స్ పరం గా దుమ్ముదులిపేసిన సినిమాలు అంటూ తెగ ప్రచారం చేసారుగా... అందుకే ఐటి శాఖ ఈ విధం గా దాడులు చేసి చూపించింది. ఇక ఈ దెబ్బకి మా సినిమా అన్ని కలెక్ట్ చేసింది... ఇన్ని కలెక్ట్ చేసింది అని చెప్పుకోవడం మానేస్తారేమో మిగతా నిర్మాతలు. అయినా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ సినిమాలు నిర్మించిన బడా నిర్మాతలపై ఇలా ఐటి శాఖ డేగ కన్నేసి దాడులు నిర్వహిస్తుంది. ఎందుకంటే అక్కడ పెద్దమొత్తం లో డబ్బు గట్రా పట్టెయ్యొచ్చని ఐటి శాఖ అనుకుంటుంది కాబట్టి. మరి చిన్న సినిమా నిర్మాతలకి కూడా ఆ ప్రాబ్లం తప్పడం లేదు. ఎందుకంటే సినిమా విడుదలైన దగ్గర నుండి మా సినిమాకి కలెక్షన్స్ సూపర్, ఓవర్సీస్ లో అయితే చెప్పక్కర్లేదు మాది మొదటి స్థానం లో వుంది అంటూ తెగ ఊదరగొట్టేస్తారు. అలా వాళ్ళు చెబుతుంటే ఐటి శాఖ మాత్రం ఎందుకూరుకుంటుంది. అంత డబ్బు అక్రమంగా వచ్చేస్తుందని వీరు దాడులు చేస్తారు. మరి ఇప్పటికైనా నిర్మాతలు తమ డబ్బా కబుర్లు కొంచెం తగ్గిస్తారేమో చూద్దాం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement