Advertisementt

నాగచైతన్య చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడాడు!

Wed 21st Sep 2016 10:32 PM
naga chaitanya,practical person,naga chaitanya about tamil entry,premam movie  నాగచైతన్య చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడాడు!
నాగచైతన్య చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడాడు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఉన్న యువహీరోలలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న హీరో ఎవరయ్యా అంటే ఠక్కున అక్కినేని నాగచైతన్య అని ఎవరైనా సమాధానం చెబుతారు. ఆయన నటించిన 'ప్రేమమ్‌, సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఇక ఆయన తాజాగా మరో మూడు చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఒకటి, సురేష్‌ ప్రొడక్షన్స్‌లో కృష్ణ అనే నూతన దర్శకునితో ఒక చిత్రం, ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్యను తమిళంలోకి ప్రవేశించే ఆలోచన ఉందా? అని అడిగితే దానికి నాగచైతన్య చెప్పిన సమాధానం ఎంతో ప్రాక్టికల్‌గా ఉంది. ఆయన మాట్లాడుతూ, తమిళ పరిశ్రమ చాలా పెద్ద మార్కెట్‌. అక్కడ ఎందరో టాలెంట్‌ ఉన్న నటులు ఉన్నారు. మనకోసమని అక్కడ ఎవ్వరూ రెడ్‌ కార్పెట్‌ పరచరు. దేనికైనా సమయం, సరైన స్ప్రిప్ట్‌ దొరకాలని సమాధానం ఇచ్చాడు. మొత్తానికి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో నాగచైతన్య.. నాగార్జున లాగానే సూటిగా మాట్లాడే అలవాటును పుణికిపుచ్చుకున్నాడని పరిశ్రమలో అనుకుంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ