Advertisementt

టాలీవుడ్ హీరోల గొప్పతనమిదే..!

Sat 17th Sep 2016 06:27 PM
tollywood,brucelee,ram charan,rakul preet singh,ram,raashi khanna,  టాలీవుడ్ హీరోల గొప్పతనమిదే..!
టాలీవుడ్ హీరోల గొప్పతనమిదే..!
Advertisement
Ads by CJ

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే అది జయాపజయాలపై ఆధారపడి సెంటిమెంట్‌ను కలిగించే రంగం. ఇక్కడ విజయాలను మించినది ఏమీ లేదు.కానీ మన టాలీవుడ్‌లో కొందరు హీరోలు మాత్రం తాము నటించిన సినిమా ఫ్లాప్‌ అయిన ఆయా హీరోయిన్లతో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయి వారితో రెండో చిత్రాలు కూడా చేస్తున్నారు. 'బ్రూస్‌లీ' చిత్రం ఫ్లాప్‌ అయినప్పటికీ రకుల్‌ప్రీత్‌సింగ్‌తో రామచరణ్‌ 'ధృవ' చిత్రంలో జోడీ కడుతున్న సంగతి తెలిసిందే. ఇక గోపీచంద్‌తో రాశిఖన్నా చేసిన 'జిల్‌' చిత్రం పెద్దగా ఆడకపోయినా ప్రస్తుతం ఈ హీరో అదే భామతో 'ఆక్సిజన్‌' చిత్రం చేస్తున్నాడు. ఇక రామ్‌ కూడా తన ఫ్లాప్‌ సినిమా 'శివమ్‌'లో నటించిన రాశిఖన్నాతోనే 'హైపర్‌' చిత్రంలో నటిస్తున్నాడు. మొత్తానికి కొంతమంది హీరోలు మాత్రం తమకు ఫ్లాప్‌ ఇచ్చిన హీరోయిన్లతో కలిసి రెండో సినిమా చేయడానికి ముందుకొస్తుండటం ఆ హీరోయిన్ల అధృష్టమనే చెప్పాలి. ఒక తెలుగులో నటించినప్పటికీ ఐరన్‌లెగ్‌గా ముద్రవేసుకొన్న వారికి కూడా బాలీవుడ్‌ పరిశ్రమ పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం కూడా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ కోవలోకి పూజాహెగ్డే, కృతిసనన్‌, కృతికర్బందాలతో పాటు రెజీనా కూడా చేరడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మరి మన హీరోయిన్లు కొందరు ఈ పరిణామాలతో ఎంతో ఆనందంగా ఉన్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ