Advertisement

విద్యాబాలన్ పట్టు కట్టిందంటే....!

Thu 15th Sep 2016 07:35 PM
vidya balan,silk,indina,pattu saries,vidya balan silk ambassador  విద్యాబాలన్ పట్టు కట్టిందంటే....!
విద్యాబాలన్ పట్టు కట్టిందంటే....!
Advertisement

మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో నటించేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్న గొప్ప నటి విద్యాబాలన్. ఆ రకంగా 'ది డర్టీ పిక్టర్' లో తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించి అందరి మెప్పులందుకుంది విద్యాబాలన్. అంతకంటే సంప్రదాయ పాత్రల్లో హుందాగా..పాత్రలో అట్టే ఒదిగిపోయే స్వభావం విద్యాబాలన్ సొంతం. సంప్రదాయ వస్త్రాలను ధరించి కట్టు, బొట్టుతో నిండుగా ఆకర్షనీయంగా దర్శనమివ్వడం విద్యాబాలన్ ప్రత్యేకత. అలా విద్యాబాలన్... మహిళా అభిమానుల్ని సంపాదించుకుంది. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకు అందించే పింఛను వంటి పథకాలకు విద్యాబాలన్‌ను ప్రచారకర్తగా నియమించింది. అయితే ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం పట్టు పరిశ్రమ శాఖ, పట్టు బోర్డుకు విద్యాబాలన్‌ నే ప్రచారకర్తగా నియమించేందుకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ సిల్క్‌ బోర్డుకు విద్యాబాలన్ అయితే ప్రచారకర్తగా బాగుంటుందని కేంద్రం ఆలోచించి ఈ సిల్క్ స్మిత పాత్రధారినిని అందుకు నిర్ణయించడంపై అభిమానుల్లో సైతం ఆనందం వ్యక్తమౌతుంది.  

దీనిపై విద్యాబాలన్ స్పందిస్తూ ‘నాకు పట్టు చీరలంటే ఎంత ఇష్టమంటే ఎవరి ఇంట్లో ఎటువంటి శుభకార్యాలకు ఆహ్వానించినా ఓ కొత్త పట్టు చీర కొనుక్కుని మరీ కట్టుకెళ్తాను. కాబట్టి ఇప్పుడు మనదేశ చీరల ఖ్యాతిని మరింత ద్విగుణీకృతం చేసే నిమిత్తం నన్ను పట్టుకు ప్రచారకర్తగా కేంద్రం చేయడం చాలా ఆనందంగా ఉంది’ అంటుంది విద్యాబాలన్. కాగా ఇప్పటికే విద్యాబాలన్ స్వచ్ఛభారత్ వంటి ఎన్నో ప్రభుత్వం తరఫు సేవా కార్యక్రమాల్లో ప్రచార కర్తగా ఉన్న విషయం తెలిసిందే.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement