Advertisementt

చిరు 150 లో కాజల్ మామూలుగా వుండదంట!

Wed 14th Sep 2016 05:35 PM
kajal agarwal,khaidi number 150,kajal latest pics,kajal agarwal makeover  చిరు 150 లో కాజల్ మామూలుగా వుండదంట!
చిరు 150 లో కాజల్ మామూలుగా వుండదంట!
Advertisement
Ads by CJ

'చందమామ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అతి తక్కువ కాలం లోనే టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో స్థానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించేసింది. ఇక ఇప్పుడు సీనియర్ హీరో  చిరంజీవి  పక్కన కూడా నటిస్తోంది. దాదాపు దశాబ్ద కాలం నుండి కాజల్ తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయి అటు తమిళ్ ఇంకా బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. బాలీవుడ్ లో ఎలా వున్నా తమిళం లో తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగింది. కాకపోతే ఈ మధ్య కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ హీరోయిన్ గా బాగా బిజీ అయిపొయింది. ఒక్క హీరోయిన్ గా నే కాదు ఇప్పుడు ఐటెం గర్ల్ అవతారం కూడా ఎత్తింది. తాజాగా 'జనతా గ్యారేజ్' లో ఐటెం సాంగ్ లో నర్తించి శభాష్ అనిపించింది. 'పక్కా లోకల్' అంటూ డాన్స్ ఇరగదీసి కుర్రకారు గుండెల్ని పిండేసింది. ఇక ఇప్పుడు చిరంజీవి 150 చిత్రం 'ఖైదీ నెంబర్ 150' లో నటిస్తూ..... అప్పుడప్పుడు తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ సినిమాలో కాజల్ బాగా గ్లామర్ గా కనిపించనుందని సమాచారం. ఈ ఫొటో లో కాజల్ నడుమందాలు చూడండి .... నా సామిరంగా... అలా కాజల్  ని చూస్తుంటే యువతని పిచ్చెక్కించేలా ఉందని హాట్ హాట్ కామెంట్స్ వచ్చేస్తున్నాయి. మరి ఇలా ఫొటోస్ లోనే కాజల్  రెచ్చిపోతుంటే ఇక 150 సినిమా విడుదలయ్యాక ఆమె అందాలు ఇంకెలా పిచ్చెక్కిస్తాయో  కదా...! పాపం కాజల్ పనై పోయింది అన్నవాళ్ళు ఈ ఫొటోస్ ని ఒక్కసారి గనక  చూస్తే తామెంత తప్పుగా మాట్లాడేమో అని రియలైజ్ అవ్వక తప్పదు.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ