Advertisementt

దిల్ రాజు ఎంతో..రామ్‌ కూడా అంతే..!

Tue 13th Sep 2016 07:06 PM
dil raju,anil ravipudi,ram,yevado okadu,dil raju vs ram,remuneration  దిల్ రాజు ఎంతో..రామ్‌ కూడా అంతే..!
దిల్ రాజు ఎంతో..రామ్‌ కూడా అంతే..!
Advertisement
Ads by CJ

హీరో రామ్‌తో గతంలో దిల్‌రాజు తీసిన 'హరేరామ.. హరేకృష్ణ' చిత్రం ఫ్లాప్‌ అయింది. కాగా ప్రస్తుతం మరోసారి ఆయన రామ్‌ హీరోగా 'పటాస్‌, సుప్రీం' చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందని సమాచారం. గత కొంతకాలంగా 'నేను...శైలజ' తప్ప మరో చెప్పుకోదగ్గ చిత్రంలేని హీరో రామ్‌ ఈ చిత్రం కోసం 6కోట్లు రెమ్యూనరేషన్‌ అడిగాడని తెలుస్తోంది. కానీ తాను చేసే ప్రతి చిత్రం విషయంలో నిక్కచ్చిగా ఉండే దిల్‌రాజు.. రామ్‌ కోరిన రూ.6కోట్లు ఇవ్వనని చెప్పాడని తెలుస్తోంది. కాగా గతంలో దిల్‌రాజు.. రవితేజ చిత్రం 'ఎవడో ఒకడు' చిత్రాన్ని కూడా కేవలం రవితేజ అడిగినంత ఇవ్వడానికి సిద్దంగా లేకపోవడంతో ఆ చిత్రం పట్టాలెక్కలేదు. ఇక రామ్‌ విషయానికి వస్తే రామ్‌ తన పారితోషికం విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉంటాడని, గతంలో బెల్లంకొండ సురేష్‌ తీసిన 'కందిరీగ' చిత్రం విషయంలో పారితోషికం విషయంలో నిర్మాతను ముప్పుతిప్పలుపెట్డాడనే టాకుంది. కానీ దిల్‌రాజు పరిస్దితివేరు. ఎవరి మార్కెట్‌ ఎంత? అనే విషయంలో దిల్‌రాజు పక్కాగా ఉంటాడు. కాగా తాజాగా రామ్‌కు అంత మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదని దిల్‌రాజు భావిస్తుండటంతో ఈ చిత్రంలో రామ్‌ను దిల్‌రాజు పక్కన పెట్టాడని విశ్వసనీయ సమాచారం. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ