Advertisement

ఈ పరిస్థితుల్లో మోత్కుపల్లి కోరిక తీరేనా!

Tue 13th Sep 2016 05:05 PM
motkupalli narasimhulu,tdp,governor,tamilnadu,rosaiah,chandrababu,bjp government,anandi ben  ఈ పరిస్థితుల్లో మోత్కుపల్లి కోరిక తీరేనా!
ఈ పరిస్థితుల్లో మోత్కుపల్లి కోరిక తీరేనా!
Advertisement

చాలాకాలం కిందటే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తే మోత్కుపల్లి నరసింహులుకు గవర్నర్‌ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే కేంద్రంలో ఎన్టీఏ గవర్నమెంట్‌ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటివరకు మోత్కుపల్లి కోరిక నెరవేరలేదు. తమిళనాడు గవర్నర్‌గా పనిచేస్తున్న కొణిజేటి రోశయ్య స్దానంలో మోత్కుపల్లికి అవకాశం వస్తుందని ఆయన బోలెడు ఆశలుపెట్టుకొని ఉన్నాడు. కానీ కేంద్రం మాత్రం మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న విద్యాసాగర్‌రావునే తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌గా నియమించింది. కాగా ఇప్పుడు తమకు గవర్నర్‌ పదవి ఇవ్వమని బిజెపిని డిమాండ్‌ చేసే పరిస్దితుల్లో తెలుగుదేశం లేదు. మరోపక్క తమిళనాడు గవర్నర్‌గా గుజరాత్‌ మాజీ సీఎం ఆనందిబెన్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. కేంద్రం కూడా గుజరాత్‌ మాజీ సీఎం ఆనందిబెన్‌ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతోంది. ఈ పరిస్దితుల్లో మోత్కుపల్లి ఆశ నెరవేరుతుందా?లేదా? అన్న అంశంపై చర్చ నడుస్తోంది. మొత్తానికి మోత్కుపల్లి ఇంతకాలం టిడిపిలో ఉండటానికి కారణం గవర్నర్‌గిరి కోసమేనని అది రాని పక్షంలో ఆయన కూడా టిఆర్‌ఎస్‌ తీర్దం పుచ్చుకుంటాడని తెలుస్తుంది. మరి మోత్కుపల్లిని బాబు ఎలా బుజ్జగిస్తాడో వేచిచూడాల్సివుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement