Advertisementt

వేరే హీరో సినిమాకి.. ఎన్టీఆర్ పాడుతున్నాడు!

Tue 13th Sep 2016 03:36 PM
ntr,pakka local,nani,jr ntr sing song for pakka local,devisri prasad  వేరే హీరో సినిమాకి.. ఎన్టీఆర్ పాడుతున్నాడు!
వేరే హీరో సినిమాకి.. ఎన్టీఆర్ పాడుతున్నాడు!
Advertisement
Ads by CJ

ఒక హీరో సినిమాలో మరో హీరో తో  వాయిస్ ఓవర్ చెప్పించి  కొంచెం వెరైటీ గా ట్రే చేస్తుంటారు టాలీవుడ్ డైరెక్టర్స్. అంతే కాకుండా వేరే హీరో సినిమా కోసం కొంతమంది హీరోలు తమ సొంత గొంతుతో పాటలు కూడా పాడి వారి సినిమాకి హెల్ప్ చేస్తుంటారు. ఆ మధ్య మనోజ్ సినిమా కోసం శింబు తన గాత్రం తో ఒక పాట పాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాని కూడా తన సినిమాలో ఒక స్టార్ హీరో తో పాట పాడించడానికి రెడీ  అవుతున్నాడని  సమాచారం. ఆ స్టార్ హీరో ఎవరో కాదు 'జనతా గ్యారేజ్' హిట్ తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తో తన 'పక్కా లోకల్' సినిమాలో నాని ఒక పాట పాడించబోతున్నాడని వినికిడి. 'పక్కా లోకల్' సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం  అందిస్తున్నాడు. దేవిశ్రీ కి 'పక్కా లోకల్' సినిమాలో ఎన్టీఆర్ తో ఒక పాట పాడిస్తే బావుంటుందని అనుకుని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ త్రినాథరావు తో ఇంకా హీరో నాని తో డిస్కస్ చేయగా వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఏముంది వెంటనే దేవిశ్రీ.. ఎన్టీఆర్ ని కలవడము నాని కోసం ఒక పాట పాడమని అడగడం జరిగిపోయాయని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ కి నాని నటన అంటే ఇష్టమున్నందు వల్ల వెంటనే ఎన్టీఆర్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటీకే ఎన్టీఆర్ తన సినిమాలు 'యమదొంగ, రభస, నాన్నకు ప్రేమతో ' లలో పాటలు పాడి శభాష్ అనిపించుకున్న విషయం తెలిసిందే.  త్వరలోనే 'పక్కా లోకల్' సినిమాలో ఎన్టీఆర్ పాటను రికార్డు చేయనున్నారని సమాచారం. ఇక ఇప్పటికే హిట్స్ తో దూసుకు పోతున్న నానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాట ప్లస్ అవుతుందనే నమ్మకం తో దర్శక నిర్మాతలు వున్నారని అంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ