Advertisementt

ఏజ్ గ్యాపే వెంకీ... నిత్య‌ల్ని క‌లిపింది..!

Sun 11th Sep 2016 03:56 PM
nithyamenen with venkatesh,kishore tirumala,aadallu meeku jhoharlu,  ఏజ్ గ్యాపే వెంకీ... నిత్య‌ల్ని క‌లిపింది..!
ఏజ్ గ్యాపే వెంకీ... నిత్య‌ల్ని క‌లిపింది..!
Advertisement
Ads by CJ
చిత్ర‌సీమ‌లో చిత్రాలంటే ఇలాంటి సంఘ‌ట‌న‌ల్నే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. నిత్య‌మేన‌న్ తెలుగులో `అలా మొద‌లైంది`తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆమె అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ప‌రిశ్ర‌మ‌లోని అగ్ర ద‌ర్శ‌కులు, క‌థానాయ‌కులు సైతం ఆమెతో ప‌నిచేయ‌డానికి సై అన్నారు. అదే స‌మ‌యంలోనే వెంక‌టేష్ సినిమాకి సంబంధించిన ఆఫ‌ర్ ఒక‌టి నిత్య ద‌గ్గ‌రికి వెళ్లింది. వెంకీ ఓ స్టార్ హీరో కాబ‌ట్టి వేరే ఎవ‌రైనా అయ్యుంటే సై అంటూ ఒప్పేసుకొనేవాళ్లే. కానీ నిత్య మాత్రం `అస‌లు వెంక‌టేష్ ఏజ్ ఏంటి?  నా ఏజ్ ఏంటి?` అని ఆ ఆఫ‌ర్‌ని నిర్దాక్షిణ్యంగా ప‌క్క‌న‌పెట్టేసింది. ఆ విష‌యం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే ఆ జోడీ క‌లిసి క‌నిపించ‌డానికి ఏ ఏజ్ గ్యాప్ అయితే అప్ప‌ట్లో అడ్డుగా మారిందో, అదే ఏజ్ గ్యాపే ఇప్పుడు క‌లప‌డం విశేషం. కిషోర్ తిరుమ‌ల వెంకీని దృష్టిలో ఉంచుకొని `ఆడాళ్లూ మీకు జోహార్లు` అనే క‌థ‌ని సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఆ క‌థ సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఏజ్ గ్యాప్ ఉన్న ఓ జంట ప్రేమ నేప‌థ్యంలో సాగే క‌థ అట అది.  క‌థానాయిక‌గా నిత్య అయితే బాగుంటుంద‌ని కిషోర్ తిరుమ‌ల అనుకొన్నాడ‌ట‌. వెంకీ కూడా అందుకు ఓకే చెప్ప‌డంతో నిత్య‌ని సంప్ర‌దించారు. ఆమెకి క‌థ రియాలిటీకి దగ్గరగా అనిపించ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేసింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో నిత్యతో పాటు మ‌రో హీరోయిన్ కూడా న‌టించ‌బోతోంద‌ని తెలుస్తోంది.
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ